Rail Bridge: ఈఫిల్​టవర్ కంటే ఎత్తులో నిర్మాణం.. ఇంజినీరింగ్ అద్భుతం.. ఉత్కంఠ రేపుతున్న కేంద్ర రైల్వే మంత్రి ప్రకటన

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేసిన ఫొటో

"మరో ఇంజినీరింగ్​ అద్భుతాన్ని అందుకునే దిశగా భారతీయ రైల్వే అడుగులు వేస్తోంది. చీనాబ్ నదిపై నిర్మిస్తోన్న ఈ స్టీల్ ఆర్చ్ మరి కొద్ది రోజుల్లోనే పూర్తి కానుంది" అని రైల్వే శాఖ మంత్రి ట్వీట్ చేశారు..

  • Share this:
జమ్మూ కశ్మీర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం ఈ బిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. ప్రస్తుతం దీని ఆర్చ్​ దాదాపు పూర్తి కావొచ్చింది.ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. భూతల స్వర్గంగా షాజహాన్​ జమ్మూ కశ్మీర్​ను వర్ణించాడు. ఆయన అభిప్రాయం నిజమే.. ఇక్కడి ఎత్తైన పర్వతాలు, నదులు, లోయలు భారత కిరీటంలో కలికితురాళ్లుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది మరో ఇంజినీరింగ్ అద్భుతానికి వేదిక కానుంది. కశ్మీర్​లో అద్భుత కట్టడం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలను రైల్వే శాఖ మంత్రి పోస్ట్ చేస్తూ "మరో ఇంజినీరింగ్​ అద్భుతాన్ని అందుకునే దిశగా భారతీయ రైల్వే అడుగులు వేస్తోంది. చీనాబ్ నదిపై నిర్మిస్తోన్న ఈ స్టీల్ ఆర్చ్ మరి కొద్ది రోజుల్లోనే పూర్తి కానుంది" అని ట్వీట్ చేశారు.

కాగా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ రైల్వే బ్రిడ్జిని జమ్మూ కశ్మీర్​లోని రియాసీ జిల్లాలో చీనాబ్​ నదిపై నిర్మిస్తున్నారు. కశ్మీర్​ను మిగతా దేశంతో కలిపే రైల్వే ప్రాజెక్ట్​లో భాగంగా ఈ బిడ్జ్​ నిర్మాణాన్ని చేపట్టారు. కాగా, 2017 నవంబర్​లో దీని నిర్మాణం ప్రారంభమైంది. చీనాబ్​ నదికి 359 మీటర్ల ఎత్తులో చేపట్టిన ఈ నిర్మాణానికి మొత్తం రూ.1250 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రైల్వే బ్రిడ్జిని 8 మ్యాగ్నిట్యూడ్​ తీవ్రతతో వచ్చే భూకంపాలను కూడా తట్టుకునే విధంగా నిర్మిస్తున్నారు.



ఈఫిల్​ టవర్​ కంటే ఎత్తులో నిర్మాణం..
ఈ రైల్వే బ్రిడ్జ్​ను 1.315 కిలోమీటర్ల పొడవు, 359 మీటర్ల ఎత్తుతో స్టీల్ సహాయంతో వంపుగా నిర్మిస్తున్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటి కేబుల్-స్టే ఇండియన్ రైల్వే బ్రిడ్జ్ కావడం విశేషం. అలాగే, నది ఒడ్డున నిర్మిస్తున్న ప్రపంచంలో ఏడో అతిపెద్ద వంపు ఆకారపు వంతెనగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ కేబుల్​ బ్రిడ్జ్​ జమ్మూ & కశ్మీర్‌లోని ఉధంపూర్​– -శ్రీనగర్– -బారాముల్లా ప్రాంతాల మధ్య రైల్ లింక్​ను ఏర్పరుస్తుంది. ఈ ప్రాజెక్టును కొంకణ్ రైల్వే హెల్మ్ చేపట్టింది. భారత స్వాతంత్ర్యం అనంతరం చేపట్టిన అత్యంత ఛాలెంజింగ్​ ప్రాజెక్ట్​గా దీన్ని రైల్వే శాఖ పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై కొంకణ్ రైల్వే చైర్మన్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ ‘‘మిగతా భారత్‌తో కశ్మీర్​ను కలుపడానికి మూడేళ్ల క్రితమే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన పనులను చేపట్టాం. 2021 డిసెంబర్ నాటికి ఈ బ్రిడ్జ్​ పనులు పూర్తవుతాయి. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఈఫిల్​ టవర్​ కంటే 30 మీటర్లు ఎత్తైనది.”అని తెలిపారు.
First published: