Home /News /national /

RAILWAY EMPLOYEE SUSPENDED AFTER TOILET PIPELINE FOUND ATTACHED TO DRINKING WATER TANK IN MADHYA PRADESH SU GH

షాకింగ్.. రైల్వేస్టేషన్‌లో తాగునీటి ట్యాంక్‌కు టాయిలెట్ పైప్.. స్టేషన్ మాస్టర్ సస్పెండ్..

ప్రతీకాత్మక చిత్రం (Image Credit: Reuters)

ప్రతీకాత్మక చిత్రం (Image Credit: Reuters)

భారతదేశంలోని రైల్వే స్టేషన్లలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత గురించి చెప్పాలంటే మాత్రం ఆలోచించాల్సిందే.

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. ప్రతిరోజూ లక్షల మంది ప్రజలు రైళ్లలో ప్రయాణాలు చేస్తుంటారు. చాలా రైళ్లు సామాన్యులకు ప్రయాణ ఖర్చులను తగ్గిస్తుంటాయి. ఇంత పెద్ద నెట్‌వర్క్ ఉన్నప్పటికీ, స్టేషన్లలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత గురించి చెప్పాలంటే మాత్రం ఆలోచించాల్సిందే. టాయిలెట్లను శుభ్రం చేయకపోవడం, నీటి సరఫరా ఉండకపోవడం వంటి సమస్యలు రైల్వే స్టేషన్లలో సాధారణమే. తాజాగా ఒక స్టేషన్ లో టాయిలెట్‌ పైప్‌లైన్‌ను తాగునీటిని సరఫరా చేసే ట్యాంకుకు పెట్టాడు ఒక పారిశుద్ధ్య కార్మికుడు. ఈ విషయం బయటకు రావడంతో ఆ స్టేషన్‌ మాస్టర్‌ను రైల్వేశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ జిల్లాలోని ఒక రైల్వే స్టేషన్ ‌లో చోటుచేసుకుంది.

ఒక అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుడు తాగునీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకుకు టాయిలెట్ పైప్ పెట్టాడని అధికారులు తెలిపారు. కోటా రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే గారోత్ రైల్వే స్టేషన్‌లో మార్చి 1న ఈ ఘటన జరిగింది. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అజయ్ కుమార్ పాల్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు ఈ పొరపాటు చేశాడు. దీన్ని గుర్తించిన సిబ్బంది టాయిలెట్ పైపును తొలగించారు. ఆ తరువాత వాటర్ ట్యాంకును పూర్తిగా శుభ్రం చేయించారు. ఈ ఘటనకు బాధ్యుడిగా చేస్తూ స్టేషన్ మాస్టర్ చౌత్మల్ మీనాను సస్పెండ్ చేసినట్లు అజయ్ కుమార్ తెలిపారు. సదరు పారిశుద్ధ్య కార్మికుడిని కూడా విధుల నుంచి తొలగించామని చెప్పారు.

* సోషల్ మీడియాలో వైరల్..  ఈ వార్త గురించి అధికారులకు తెలియక ముందే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తరువాత అధికారులకు విషయం తెలియడంతో తీవ్రంగా స్పందించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెస్ట్ సెంట్రల్ రైల్వే మార్చి 5న ప్రకటించింది. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఉచితంగా తాగునీరు అందించే వ్యవస్థలు ఉన్నాయి. ఒకవైపు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ తప్పిదంపై అధికారులు తీవ్రంగా స్పందించారు. నివేదిక తెప్పించుకొని స్టేషన్ మాస్టర్‌ను సస్పెండ్ చేశారు.





గత కొన్ని వారాలుగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఒకవైపు వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నప్పటికీ, కొత్త రకం వైరస్ స్ట్రెయిన్‌ వల్ల ప్రజల్లో భయాలు నెలకొన్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రస్తుత సంఘటన వైరల్ అయ్యింది. దీంతో ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తామని కోటా డివిజన్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఇలాంటి తప్పులు మరోసారి జరగకుండా జాగ్రత్తపడతామని తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Indian Railway, Madhya pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు