(అన్నా రఘు, న్యూస్ 18 సీనియర్ కరెస్పాండెంట్, అమరావతి)
రైలు ప్రయాణంలోమన వస్తువులను మర్చిపోవటం.. పోగొట్టుకోవటం.. సర్వ సాధారణం. పోయిన వస్తువులు తిరిగి దొరకడం చాలా అరుదు. కానీ మీరు పోగొట్టుకున్న వస్తువులను స్వయంగా రైల్వేశాఖ సిబ్బందే.. మీ ఇంటికి తీసుకొచ్చి.. అప్పగిస్తే ఎలా ఉంటుంది..? అప్పుడు మన ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఓ ఫ్యామిలీకి ఎదురయింది. రైల్లో ఓ చిన్నారి బొమ్మను మర్చిపోవడంతో.. తోటి ప్రయాణికుడి సాయంతో.. రైల్వే సిబ్బంది వారి ఇంటికే వెళ్లి..అప్పగించారు.
అది సికింద్రాబాద్-అగర్తలా ప్రత్యేక రైలు. జనవరి 4, 2023న భుసిన్ పట్నాయక్ అనే వ్యక్తి. . బీ-2 కోచ్‌లో ప్రయాణించాడు. అతడి కి ఎదురు సీట్లో.. 19 నెలల బాబుతో ఓ ఫ్యామిలీ కూర్చుంది. బాలుడు వద్ద ఓ ట్రక్కు బొమ్మ ఉంది. దానితో ఎంతో ఇష్టంగా ఆడుకోవడాన్ని భుసిన్ గమనించాడు. సుదూర ప్రయాణం తర్వాత.. బాలుడి ఫ్యామిలీ వెస్ట్ బెంగాల్‌లోని నార్త్ దినాజ్ పూర్ జిల్లా అలియాబురి రైల్వే స్టేషన్‌లో దిగిపోయింది. ఐతే త్వరగా దిగాలనే కంగారులో.. వారు ఆ బాబు ట్రక్కు బొమ్మను మర్చిపోయారు. అది సీటుపైనే ఉండడాన్ని భుసిన్ గుర్తించాడు. దానిని ఎలాగైనా వారికి చేరవేయాలనుకున్నాడు. వెంటనే ‘ రైల్ మదద్’ యాప్ ద్వారా 139కి కాల్ చేసి సికింద్రాబాద్ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడు.
ఐతే ఆ ఫ్యామిలీ గురించి తనకు ఏ వివరాలు తెలియనవి.. కేవలం సీటు నెంబర్ మాత్రమే తెలుసని చెప్పాడు. ఆ సీటు నెంబర్ ఆధారంగా సికింద్రాబాద్ రైల్వే అధికారులు వారి వివరాలను తెలుసుకున్నారు. మోహిత్, నస్రీన్ బేగం దంపతులు ఆ సీట్లో ప్రయాణించారని గుర్తించారు. వారి స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా ఖాజీగావ్. ఆ తర్వాత రైలు లైవ్ లోకేషన్‌ను ట్రేస్ చేసి.. న్యూ జల్పాయ్ గురి స్టేషన్ రాగానే... అక్కడ రైల్వే సిబ్బంది బుసిన్ నుంచి ఆ ట్రక్కు బొమ్మను తీసుకున్నారు. అనంతరం అలియాబురి స్టేషన్‌కు 20 కి.మీ. దూరంలో ఉన్న వారి ఇంటికి వెళ్లిన బాలుడికి బొమ్మను అందజేశారు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఈ సందర్బంగా చిన్నారి తండ్రి మోహిత్ మాట్లాడుతూ.. నా కుమారుడి బొమ్మ రైల్లో పోయింది. బొమ్మ కనబడక ఏంతో ఏడ్చాడు. ఆ క్షణాలు నన్ను ఎంతో బాధించాయి. కానీ నేను ఎమీ చేయలేకపోయాను. ఈ విషయంలో ఎవరు కూడా నాకు సహాయం చేస్తారని అనుకోలేదు. అందుకే రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేయలేదు. కానీ రైల్వే సిబ్బందే స్వయంగా ఇంటికి వచ్చి బొమ్మను ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అని అన్నారు.
తన కుమారుడి బొమ్మ తీసుకొచ్చినందుకు అతడి తండ్రి ఎంతో సంతోషపడ్డాడు. రైల్వే సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆ బాబు బొమ్మ గురించి.. రైల్వే శాఖకు ఫిర్యాదు చే..సి ఆ చిన్నారి ముఖంలో ఆనందానికి కారణమైన భుసిన్ పట్నాయక్, రైల్వే సిబ్బందిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, West Bengal