Home /News /national /

RAILWAY CANCELS 32 PASSENGER TRAINS DUE DOUBLING WORK PROGRESS HERE ARE FULL DETAILS PCV

Train Alert : ట్రెయిన్ అలర్ట్.. దేశమంతటా 32 రైళ్లు రద్దు.. చెక్ చేసుకోండి

Trains Canceled

Trains Canceled

ట్రాక్‌ డబ్లింగ్‌ కింద నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల వల్లే రైళ్లను రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

  Train Alert : దేశవ్యాప్తంగా 32 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. హైదరాబాద్ సహా.. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర మీదుగా వెళ్లే 32 రైళ్లు క్యాన్సిల్ అయ్యాయి. యూపీ ఝాన్సీలోని వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్‌ మీదుగా ఈ రైళ్లన్నీ వెళ్తుండటం.. అక్కడే ట్రాక్ డబ్లింగ్ పనులు జరుగుతున్న కారణంగా.. ఈ 32 రైళ్లను జూలై 15 వరకు రద్దు చేశారు.

  ఈ రైళ్లన్నీ మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని కొన్ని జిల్లాలు, ముంబై, హైదరాబాద్ నగరాల మీదుగా వెళ్లాల్సి ఉంది. వాస్తవానికి, కాన్పూర్ జిల్లాలోని భీమ్‌సేన్, గోపామౌ, రసూల్‌పూర్, పామా రైల్వే స్టేషన్‌ల కోసం ట్రాక్ డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. ట్రాక్‌ డబ్లింగ్‌ కింద నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల వల్లే రైళ్లను రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

  మహారాష్ట్రకు వెళ్లే ఈ రైళ్లు రద్దు :

  1. రైలు నెం. 01051, లోకమాన్య తిలక్ టెర్మినల్-మౌ (వీక్లీ), 30.06.2022న రద్దు

  2. రైలు నం. 01052, మౌ- లోకమాన్య తిలక్ టెర్మినల్ (వీక్లీ), 02.07.2022న రద్దు

  3. రైలు నం. 15102, లోకమాన్య తిలక్ టెర్మినల్-ఛప్రా, (వీక్లీ), 07.07.2022 , 14.07.2022న రద్దు

  4. రైలు నెం. 15101, ఛాప్రా-లోకమాన్య తిలక్ టెర్మినల్ (వీక్లీ), 05.07.2022 , 12.07.2022న రద్దు

  5. రైలు నం. 22122, లక్నో-లోకమాన్య తిలక్ టెర్మినల్ (వీక్లీ), 10.07.2022న రద్దు

  6. రైలు నం. 22121, లోకమాన్య తిలక్ టెర్మినల్-లక్నో (వీక్లీ), 09.07.2022న రద్దు

  7. రైలు నం. 11408, లక్నో-పూణె (వీక్లీ), 07.07.2022, 14.07.2022న రద్దు

  8. రైలు నం. 11407, పూణే-లక్నో (వీక్లీ), 05.07.2022 , 12.07.2022న రద్దు

  9. రైలు నం. 12104, లక్నో-పూణె (వీక్లీ), 06.07.2022 , 13.07.2022న రద్దు

  10. రైలు నం. 12103, పూణే - లక్నో (వీక్లీ), 05.07.2022 , 12.07.2022న రద్దు

  11. రైలు నెం. 12598, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్-గోరఖ్‌పూర్ (వీక్లీ), 06.07.2022 , 13.07.2022న రద్దు

  12.రైలు నెం. 12597, గోరఖ్‌పూర్-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ (వీక్లీ), 05.07.2022 , 12.07.2022న రద్దు  గుజరాత్‌కు వెళ్లే కింది రైళ్లు రద్దు :

  1. రైలు నం. 09465, అహ్మదాబాద్-దర్భంగా వీక్లీ, 01.07.2022 మరియు 08.07.2022న రద్దు

  2. రైలు నెం. 09466 దర్భంగా-అహ్మదాబాద్ వీక్లీ, 04.07.2022 మరియు 11.07.2022న రద్దు

  3. రైలు నం. 22468, గాంధీనగర్ క్యాపిటల్-వారణాసి వీక్లీ, 07.07.2022 మరియు 14.07.2022న రద్దు

  4. రైలు నెం. 22467, వారణాసి-గాంధీనగర్ క్యాపిటల్ వీక్లీ, 06.07.2022 మరియు 13.07.2022న రద్దు

  మధ్యప్రదేశ్‌కు వెళ్లే కింది రైళ్లు రద్దు :

  1. రైలు నం. 12536, రాయ్‌పూర్-లక్నో (వారంలో 2సార్లు), 08.07.2022 మరియు 15.07.2022న రద్దు చేయబడింది

  2. రైలు నం. 12535, లక్నో-రాయ్‌పూర్ (వారంలో 2సార్లు), 07.07.2022 మరియు 14.07.2022న రద్దు చేయబడింది

  3. రైలు నం. 04144, కాన్పూర్ సెంట్రల్-ఖజురహో డైలీ, 08.07.2022 నుండి 15.07.2022 వరకు రద్దు చేయబడింది

  4. రైలు నం. 04143, ఖజురహో-కాన్పూర్ సెంట్రల్ డైలీ, 07.07.2022 నుండి 14.07.2022 వరకు రద్దు చేయబడింది

  5. రైలు నం. 15206, జబల్‌పూర్-లక్నో డైలీ, 13.07.2022, 14.07.2022 మరియు 15.07.2022న రద్దు చేయబడింది

  6. రైలు నం. 15205, లక్నో-జబల్పూర్ డైలీ, 12.07.2022 నుండి 14.07.2022 వరకు రద్దు చేయబడింది

  హైదరాబాద్‌కు వెళ్లే కింది రైళ్లు రద్దు :

  1. రైలు నం. 02576, గోరఖ్‌పూర్-హైదరాబాద్ వీక్లీ, 03.07.2022 మరియు 10.07.2022న రద్దు చేయబడింది

  2. రైలు నం. 02575, హైదరాబాద్-గోరఖ్‌పూర్ వీక్లీ, 01.07.2022 మరియు 08.07.2022న రద్దు చేయబడింది

  ఈ రైళ్లు కూడా రద్దు కానున్నాయి:

  1. రైలు నం. 19305, డాక్టర్ అంబేద్కర్ నగర్-కామాఖ్య వీక్లీ, 30.06.2022 మరియు 07.07.2022న రద్దు చేయబడింది

  2. రైలు నం. 19306, కామాఖ్య-డా. అంబేద్కర్ నగర్ వీక్లీ, 03.07.2022 మరియు 10.07.2022న రద్దు చేయబడింది

  3. రైలు నం. 14109, చిత్రకూట్ ధామ్-కాన్పూర్ సెంట్రల్ డైలీ, 07.07.2022 నుండి 14.07.2022 వరకు రద్దు చేయబడింది

  4. రైలు నం. 14110 కాన్పూర్ సెంట్రల్ నుండి చిత్రకూట్ ధామ్ రోజువారీ, 07.07.2022 నుండి 14.07.2022 వరకు రద్దు చేయబడింది

  5. రైలు నం. 01802, కాన్పూర్ సెంట్రల్-మాణిక్‌పూర్ డైలీ, 12.07.2022 నుండి 14.07.2022 వరకు రద్దు చేయబడింది

  6. రైలు నెం. 01801, మానిక్‌పూర్-కాన్పూర్ సెంట్రల్ డైలీ, 12.07.2022 నుండి 14.07.2022 వరకు రద్దు చేయబడింది

  7. రైలు నం. 11110, లక్నో - వీరాంగన లక్ష్మీబాయి డైలీ, 13.07.2022 మరియు 14.07.2022న రద్దు చేయబడింది

  8. రైలు నం. 11109, వీరాంగన లక్ష్మీబాయి-లక్నో డైలీ, 13.07.2022 మరియు 14.07.2022న రద్దు చేయబడింది

  ప్యాసింజర్లు తమ షెడ్యూల్ ను మరోసారి చెక్ చేసుకోవాలని సూచించారు ఝాన్సీ డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మనోజ్ కుమార్. ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా మొత్తం 32 రైళ్లు జూలై 15 వరకు రద్దు చేశామని చెప్పారు. దీంతో పాటు కొన్ని రైళ్ల రూట్లను మార్చామన్నారు. ఈ రైళ్లలో అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులకు రైల్వే రీఫండ్‌ ఇస్తుందని తెలిపారు. ఈ సమయాల్లో.. ఈ మార్గాల్లో రైలు ప్రయాణం ప్రారంభించే ముందు తప్పనిసరిగా రైలు షెడ్యూల్‌ను తనిఖీ చేయాలని అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.
  Published by:V. Parameshawara Chary
  First published:

  Tags: Hyderabad, India Railways, Train

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు