Home /News /national /

RAILWAY BUDGET 2021 100 PERCENT ELECTRIFICATION FANCY COACHES FOR TOURISTS PART OF NATIONAL RAILWAY PLAN FOR INDIA 2030 SU

Railway Budget 2021: రైల్వేల అభివృద్ది కోసం కొత్త ప్లాన్.. 10 ఏళ్ల రోడ్డు మ్యాప్ ప్రకటించిన నిర్మలా సీతారామన్

ఇండియన్ రైల్వేస్(ప్రతీకాత్మక చిత్రం)

ఇండియన్ రైల్వేస్(ప్రతీకాత్మక చిత్రం)

కేంద్ర బడ్జెట్ 2021ను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి భారతీయ రైల్వేలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.

  కేంద్ర బడ్జెట్ 2021ను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి భారతీయ రైల్వేలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. బడ్జెట్‌లో రైల్వే రంగానికి 1.15 లక్షల కోట్లు కేటాయించడంతోపాటుగా.. భారత నూతన జాతీయ రైల్వే ప్లాన్ 2030ని ప్రకటించారు. గతేడాది భారతీయ రైల్వే రంగంపై కరోనా వైరస్ తీవ్ర ప్రబావాన్ని చూపిన సంగతి తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రైల్వే సర్వీసులు కొన్ని నెలల పాటు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖకు సంబంధించి పదేళ్ల రోడ్డు మ్యాప్‌ను ప్రకటించిన మంత్రి.. పర్యాటక రూట్లలో ప్రయాణికులకు మరింత లగ్జరీ అందించడానికి నూతన కోచ్‌లను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా భారతీయ రైల్వేల ప్రాధాన్యత గురించి మాట్లాడిన నిర్మలా సీతారామన్.. ఈస్టర్న్, వెస్టర్న్ కారిడార్ల గురించి ప్రస్తావించారు.

  ఆత్మ నిర్భర్ భారత్‌ను ప్రోత్సహించడంలో భాగంగా పరిశ్రమల కోసం లాజిస్టిక్స్ ఖర్చులను కేంద్రం తగ్గిస్తుందన్నారు. అదే విధంగా 2022 జూలై నెల నాటికి ఈస్టర్న్, వెస్టర్న్ ప్ర్యతేక సరకు రవాణా కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వీటిలో కొన్నింటిని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తామన్నారు. 2023 డిసెంబర్ నాటికి బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్‌‌లను 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మల తెలిపారు. ప్రయాణికుల సౌకర్యంపై స్పందించిన మంత్రి.. పర్యాటక రూట్లలో తిరిగే రైళ్లకు కొత్త Vistadome LHB coaches జత చేయనున్నట్టు తెలిపారు. ఎక్కువ రద్దీ, వినియోగం ఉన్న రూట్లలో ట్రెయిన్ సేఫ్టీ కోసం యాంటీ కొలిజన్ సిస్టమ్‌‌ను ఇన్‌స్టాల్ చేయనున్నట్లు పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా భారత రైల్వే తీసుకున్న భద్రత చర్యలు సత్పలితాలు ఇస్తున్నాయని తెలిపారు.

  ఇక, గతేడాది డిసెంబర్ కేంద్రం.. జాతీయ రైలు ప్రణాళిక ముసాయిదా జారీ చేసిన సంగతి తెలిసిందే. 2030 నాటికి డిమాండుకు మించి సామర్థ్యం మెరుగుపరచడం, సరకు రవాణాలో రైల్వేలపరంగా వాటాను 45 శాతానికి పెంచడం కోసం మూలధన పెట్టుబడిలో ప్రారంభ ఉత్తేజాన్ని జాతీయ రైలు ప్రణాళిక నిర్దేశించుకుంది. సరకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని ప్రస్తుత 22 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల స్థాయికి పెంచడం... తద్వారా సరకు రవాణా సమయాన్ని గణనీయంగా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. రైలు రవాణా ఖర్చును మొత్తంమీద దాదాపు 30 శాతందాకా తగ్గించి, ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించాలని ప్రణాళికలు సిద్దం చేసింది. జాతీయ రైలు ప్రణాళికలో భాగంగా 2024కల్లా కొన్ని కీలక ప్రాజెక్టుల సత్వర అమలుకు ‘విజన్-2024’కు రైల్వేశాఖ శ్రీ‌కారం చుట్టింది. ఈ మేర‌కు 2024క‌ల్లా 100 శాతం విద్యుదీకరణ, రద్దీ మార్గాల్లో బ‌హుళ రైలుప‌ట్టాల వ్య‌వ‌స్థ‌, ఢిల్లీ-హౌరా; ఢిల్లీ-ముంబై మార్గాల్లో రైళ్ల వేగాన్ని 160 కిలోమీటర్లకు పెంచ‌డంతోపాటు GQ-GD మార్గాల‌న్నిటిలోనూ రైళ్ల వేగాన్ని 130 కిలోమీటర్లకు పెంచడం కూడా విజన్ -2024లో పేర్కొన్నారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Budget 2021, Indian Railways, Nirmala sitharaman, Union Budget 2021

  తదుపరి వార్తలు