Home /News /national /

RAILWAY BOARD SETUP HIGH LEVEL COMMITTEE TO LOOK AFTER THE ISSUE ON RRB NTPC RESULTS AK

RRB ఫలితాలపై వివాదం.. రైలుకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. రైల్వేబోర్డు కీలక నిర్ణయం

కొనసాగుతున్న ఆందోళనలు

కొనసాగుతున్న ఆందోళనలు

RRB Results Controversy: బీహార్‌లోని పాట్నా, నవాడా, ముజఫర్‌పూర్, సీతామర్హి, బక్సర్, భోజ్‌పూర్ తదితర జిల్లాల్లోనూ ఆందోళనలు కనిపించాయి. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో రైల్వే బోర్డు సమస్య పరిష్కారం దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.

    ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పోస్టుల పరీక్షా ఫలితాలపై చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. బీహార్‌లోని గయా రైల్వే స్టేషన్‌లో విద్యార్థులు ఓ ప్యాసింజర్ రైలుకు నిప్పు పెట్టారు. మరో రైలుపై రాళ్లు రువ్వారు. విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో బీహార్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గత రెండు రోజులుగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. పలుచోట్ల విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థుల నిరసనతో బీహార్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జెహానాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను రైల్వే ట్రాక్‌పై దగ్ధం చేశారు. సీతామర్హిలో ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. గాల్లోకి కాల్పులు జరిపారు. విద్యార్థులను చెదరగొట్టారు.

    బీహార్‌లోని పాట్నా, నవాడా, ముజఫర్‌పూర్, సీతామర్హి, బక్సర్, భోజ్‌పూర్ తదితర జిల్లాల్లోనూ ఆందోళనలు కనిపించాయి. మరోవైపు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో రైల్వే బోర్డు సమస్య పరిష్కారం దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. విద్యార్థులు తమ ఫిర్యాదులు, సూచనలను ఫిబ్రవరి 16 వరకు ఆ కమిటీకి తెలియజేయవచ్చని పేర్కొంది. మేరకు ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ సీబీటీ 1 పరీక్షా ఫలితాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఆ తరువాత రైల్వే మంత్రిత్వ శాఖకు కమిటీ నివేదికను ఇస్తుంది. నివేదికను పరిశీలించిన అనంతరం రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ ఫలితాలపై తుది నిర్ణయం తీసుకుంటుంది.

    ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి రిక్రూట్‌మెంట్ పరీక్షలో స్కామ్ జరిగిందని అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల నిరీక్షణ తర్వాత CBT 1 ఫలితం ప్రకటించారు. అభ్యర్థులు కట్-ఆఫ్ చాలా ఎక్కువగా ఉందని, ఇతర అభ్యర్థుల పరిధిని పరిమితం చేసే బహుళ పాత్రలకు ఒకే అభ్యర్థిని ఎంపిక చేశారని పేర్కొన్నారు. తక్కువ అర్హతలు ఉన్న ఉద్యోగాల్లో కూడా ఉన్నత విద్యావంతుల అభ్యర్థులకే రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు మొగ్గు చూపుతున్నాయని ఉద్యోగార్ధులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు 10వ, 12వ తరగతి ఉత్తీర్ణులైన ఉద్యోగాలకు కూడా ఎంపికైన అభ్యర్థులలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లేనని పేర్కొన్నారు.

    Padma Awards: లిటరేచర్, ఎడ్యుకేషన్ రంగంలో విదేశీ సంస్కృత పండితులకు పద్మ అవార్డులు.. గ్రహీతలు ఎవరంటే..

    బీహార్‌లో విధ్వంసకరంగా మారిన రైల్వే బోర్డు ఉద్యోగ అభ్యర్దుల నిరసనలు

    ఇదిలా ఉంటే రైల్వే ట్రాక్‌లపై అభ్యర్థులు నిరసనలు చేయడం, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించడం, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం వంటివి క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రదర్శించాయని అధికారిక నోటీసులో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పేర్కొంది. ఈ విషయాన్ని పరిశీలించేందుకు వీడియో స్పెషలైజ్డ్ ఏజెన్సీలను నియమిస్తామని RRB తెలిపింది. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న అభ్యర్థులు పోలీసు చర్యలను ఎదుర్కోవడమే కాకుండా జీవితకాలం రైల్వే పరిధిలోని ఉద్యోగాల నుంచి కూడా నిషేధించబడతారని పేర్కొంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Indian Railway, RRB

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు