కొన్ని డిమాండ్లు ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉంటాయి. ఎన్నిసార్లు ఎంతగా మొరపెట్టుకున్నా.. వాటిని పట్టించుకునేవాళ్లు ఉండరు. కానీ రైల్వేశాఖలో కొన్నేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన ఓ డిమాండ్ మాత్రం ఎట్టకేలకు నిజమైంది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చొరవ తీసుకోవడంతో ఉద్యోగులు ఎంతోకాలంగా కోరుతున్న ఈ డిమాండ్ వాస్తవ రూపం దాల్చినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. రైల్వే ఉద్యోగుల ఏళ్ల తరబడి డిమాండ్‌ను రైల్వే బోర్డు నెరవేర్చింది. రైలులో నియమించబడిన గార్డును ఇప్పుడు రైలు మేనేజర్ అని పిలుస్తారు. ఈ మేరకు అన్ని రైల్వేల జనరల్ మేనేజర్లకు రైల్వే బోర్డు లేఖ జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుంది. ఇది భారతీయ రైల్వే అధికారిక ఖాతాలో బహిరంగంగా ప్రకటించింది. రైల్వే బోర్డు నిర్ణయంతో ఉద్యోగుల ఏళ్ల తరబడి డిమాండ్ నెరవేరింది.
2004 నుండి గార్డు హోదాను మార్చాలనే డిమాండ్ ఉంది. దీని వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. గార్డు పని కేవలం సిగ్నల్, టార్చ్‌లు చూపించడం మాత్రమే కాదు. రైళ్లలో ప్రయాణీకుల అవసరాలను తీర్చడంతో పాటు, పార్శిల్ మెటీరియల్ నిర్వహణ, ప్రయాణీకుల భద్రత, రైలు భద్రత కూడా గార్డులదే. అటువంటి తమ హోదాను మార్చాలని ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. దీంతో రైల్వేబోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే వీరి హోదాను మార్చడం ద్వారా వీరి బాధ్యతల్లో ఎలాంటి మార్పు ఉండదని రైల్వే అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు రైల్వేల్లో అసిస్టెంట్ గార్డ్‌గా వ్యవహరించిన వారిని ఇకపై అసిస్టెంట్ ప్యాసింజర్ రైలు మేనేజర్‌గా పిలుస్తారు. గూడ్స్ గార్డ్‌గా ఉన్నవారిని గూడ్స్ రైలు మేనేజర్‌గా... సీనియర్ గూడ్స్ గార్డ్‌ను సీనియర్ గూడ్స్ రైలు మేనేజర్‌గా.. సీనియర్ ప్యాసింజర్ గార్డ్‌ను సీనియర్ ప్యాసింజర్ రైలు మేనేజర్‌గా పిలుస్తారు. మెయిల్/ఎక్స్‌ప్రెస్ గార్డ్‌ను మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైలు మేనేజర్‌గా గుర్తిస్తారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.