• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • RAILWAY BOARD CHIEF SAYS WASNT TOLD ABOUT DUSSEHRA EVENT NEAR TRACKS LOCALS SAY ITS BEEN ON FOR 20 YEARS

ఈ ఘోరకలికి ఎవరు బాధ్యులు?.. అమృత్‌సర్ ఘటనపై బ్లేమ్ గేమ్!

ఈ ఘోరకలికి ఎవరు బాధ్యులు?.. అమృత్‌సర్ ఘటనపై బ్లేమ్ గేమ్!

అమృత్‌సర్ ఘటనలో చనిపోయిన తమవారి కోసం రోధిస్తున్న మహిళలు(AP Photo/Prabhjot Gill)

అమృత్‌సర్ దుర్ఘటనలో అసలు తప్పెవరిది?.. పట్టాల పైకి వెళ్లినవారిదే తప్పా?.. లేక రైల్వే అధికారుల నిర్లక్ష్యమా?.. ఇంత భారీ స్థాయిలో జనం వస్తారని తెలిసీ అక్కడ ఏర్పాట్లను పట్టించుకోని స్థానిక అధికారులదా?..

  • Share this:
    అమృత్‌సర్ ఘోరకలికి బాధ్యులెవరు?.. స్థానిక అధికారుల వైఫల్యమా?.. లేక రైల్వే నిర్లక్ష్యమా?.. రైల్వే ఛైర్మన్ మాత్రం తమకేమి సంబంధం లేదంటూ ఇప్పటికే తేల్చేశారు. జోడా పాటక్‌లో రావణ దహనానికి సంబంధించి తమకు సమాచారం ఇవ్వడం కానీ, రైల్వే నుంచి అనుమతులు కోరడం కానీ జరగలేదని చెప్పారు.మరోవైపు స్థానికులేమో 20 ఏళ్లుగా అక్కడే రావణ దహనాన్ని నిర్వహిస్తున్నామని, రైల్వే అధికారులకు ఈ విషయం తెలియకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.

    ప్రమాదం జరిగింది లెవల్ క్రాసింగ్ వద్ద కాదు.. అమృత్‌సర్-మానావాలా స్టేషన్ల మధ్య. మార్గమధ్యలో రైలు స్పీడ్‌ను నియంత్రించడం సాధ్యం కాదు. నిర్దేశించిన స్పీడ్ మేరకు.. రైళ్లు ఆ వేగంతోనే నడవాల్సి ఉంటుంది. ఒకవేళ డ్రైవర్ సడెన్‌గా బ్రేక్స్ వేసినా.. అది మరో ప్రమాదానికి దారి తీస్తుంది. అయినా జనాలు ట్రాక్ మీదకు వస్తారని ఎవరూ ఊహించరు కదా. మా సిబ్బంది లెవల్ క్రాసింగ్స్ వద్ద మాత్రమే ఉంటారు, మధ్యలో ఎవరూ ఉండరు. కాబట్టి ఈ ఘటనకు రైల్వే బాధ్యత వహించదు.
    అశ్వనీ లోహని, రైల్వే బోర్డ్ ఛైర్మన్


    రైల్వే స్థలాన్ని ఆనుకుని ఉన్న ఆ ప్రాంతంలో అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తమకెలాంటి సమాచారం లేదన్నారు రైల్వే బోర్డ్ చైర్మన్. ఎవరూ తమను అనుమతులు కోరలేదని చెప్పారు. మరోవైపు స్థానికుల వాదన మాత్రం మరోలా ఉంది. ఇక్కడ 20ఏళ్లుగా రావణ దహనం నిర్వహిస్తున్నామని, గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని వారు చెబుతున్నారు.

    ప్రమాదానికి ముందు మరో రెండు రైళ్లు కూడా ఆ ట్రాక్ నుంచి వెళ్లాయని, కానీ అవి తక్కువ స్పీడ్‌తో వెళ్లాయని అంటున్నారు. కానీ ప్రమాదానికి కారణమైన రైలు మాత్రం వేగంగా దూసుకురావడంతో.. పట్టాలపై ఉన్నవారు పక్కకు తప్పుకునే వీలు కూడా లేకపోయిందని వాపోతున్నారు.అటు స్థానిక అధికారులు కూడా ఘటనపై పెద్దగా నోరు మెదపకపోవడం గమనార్హం. మొత్తం మీద ఎవరికి వారు ఈ దుర్ఘటనతో తమకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటున్నారు.దీంతో ఈ ఘోరకలికి బాధ్యులెరన్న ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ ఘటనలో 60 పైచిలుకు మంది చనిపోగా.. మరో 65మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    అగ్ర కథనాలు