హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rail Roko today : రైల్ ట్రిఫిక్ అంతరాయం -రైతులపై దేశద్రోహం కేసులు -UPలో ఉద్రిక్తత

Rail Roko today : రైల్ ట్రిఫిక్ అంతరాయం -రైతులపై దేశద్రోహం కేసులు -UPలో ఉద్రిక్తత

రైతుల రైల్ రోకో

రైతుల రైల్ రోకో

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనోద్యమం మరింత వేడెక్కింది. యూపీలోని లఖీంపూర్ జిల్లాలో రైతులపై హింసాకాండ, దానికి బాధ్యుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా డిమాండ్ తో సోమవారం నాడు రైతులు దేశవ్యాప్త రైల్ రోకో చేపట్టారు.. దీని వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం తప్పేలా లేదు..

ఇంకా చదవండి ...

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం మరింత తీవ్రతరమైంది. లఖీంపూర్ హింసాకాండను నిరసిస్తూ, దానికి బాధ్యుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాను డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు సోమవారం నాడు రైల్ రోకో చేపట్టాయి. దేశవ్యాప్తంగా కొనసాగనున్న ఇవాళ్టి రైల్ రోకో వల్ల రైల్ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎక్కడిక్కడే రైళ్లను అడ్డుకుంటామని రైతు సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా, రైతు ఉద్యమాన్ని అణిచేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని డిసైడైంది. రైతుల మాత్రం తగ్గేదేలేదని ముందుకెళుతున్నారు. వివరాలివి..

యూపీలోని లఖీంపూర్ జిల్లాలో రైతులపై హింస, ఆ ఘటనలో ప్రధాన నిందితుడైన ఆశిష్ మిశ్రా తండ్రి అజయ్ మిశ్రా ఇప్పటికీ కేంద్ర మంత్రి పదవిలోనే కొనసాగుతుండటాన్ని నిరసిస్తూ రైతు సంఘాల సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్ఛా (ఎస్కేఎం) సోమవారం నాడు దేశ వ్యాప్త రైల్ రోకో చేపట్టింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు రైల్ రోకో ఉంటుందని, అన్ని రాష్ట్రాల్లో స్థానిక రైతు సంఘాలు ఆ ఆరు గంటలపాటు రైలు పట్టాలపైనే నిరసనలు తెలుపుతారని మోర్ఛా తెలిపింది. రైల్ రోకో వల్ల ఉత్తరాదిలో తీవ్రంగా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఒక మోస్తారుగా రైల్ ట్రాఫిక్ ప్రభావితమవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది. వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులకు ఇవాళ ఇబ్బందులు తప్పేలా లేవు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిగా ఉద్యమిస్తోన్న రైతులు.. ఇటీవలి లఖీంపూర్ ఘటన తర్వాత కార్యచరణ ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. మొన్న దసరా పండుగనాడు ఉత్తరాదిలో చాలా చోట్ల రావణవధలో మోదీ-షా దిష్టిబొమ్మల్ని తగులబెట్టారు. తర్వాతి కార్యక్రమంగా ఇవాళ (అక్టోబర్ 18) రైల్ రోకో చేపట్టారు. ఈనెల 26న యూపీ రాజధాని లక్నోలో మహాపంచాయత్ నిర్వహించనున్నారు. అయితే, రైతు నిరసనకారులపై ఉక్కుపాదం మోపాలని యోగి సర్కారు డిసైడైంది. ఆ మేరకు..

రైల్ రోకో నేపథ్యంలో లక్నోలో ఇవాళ 144 సెక్షన్ విధించారు. నిరసనలకు అనుమతి లేదని, రైళ్లను అడ్డుకున్నా, నిబంధనల్ని ఉల్లంఘించినా దేశద్రోహం చట్టం కింద లోపలేస్తామని యూపీ పోలీసులు హెచ్చరించారు. కాగా, రైల్ రోకోను శాంతియుతంగా చేపట్టాలని, నిరసన సమయంలో రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించొద్దని నిరసనకారులకు సంయుక్త్ కిసాన్ మోర్ఛా కోరింది.

Published by:Madhu Kota
First published:

Tags: Farmers Protest, Rail, Uttar pradesh

ఉత్తమ కథలు