RAIL PROTESTS ORIGINAL NAME AND TOWN UNKNOWN WHO IS KHAN SIR WHAT IS HIS ROLE IN THE PROTEST OF RAILWAY TESTS EVK
Rail Protests: అసలు పేరు, ఊరు తెలియదు.. ఎవరీ "ఖాన్ సార్".. రైల్వే పరీక్షల నిరసనలో అతని పాత్ర ఏమిటీ?
ఖాన్ సార్
జనవరి 26, 2022న RRB NTPC పరీక్షకు సంబంధించి హింసాత్మకంగా మారిన నిరసన తర్వాత 14.5 మిలియన్ల మంది యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్న ఖాన్ సర్‌పై పోలీసులు, దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. ఇతని అసలు పేరు.. ఊరు ఎవ్వరికీ తెలియదు.. కేవలం యూట్యూబ్ ద్వారానే పాపులర్ అయ్యారు.
రైల్వే రిక్రూట్మెంట్ (Railway Recruitment) డ్రైవ్‌కు సంబంధించి పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఇప్పటికే ఈ ఘటనలకు సంబంధించిన నిరసనలో పాల్గొన్న 8 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆరు కోచింగ్ సెంటర్ యజమానులపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. అంతే కాకుండా జనవరి 26, 2022న RRB NTPC పరీక్షకు సంబంధించి హింసాత్మకంగా మారిన నిరసన తర్వాత 14.5 మిలియన్ల మంది యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్న ఖాన్ సర్‌పై పోలీసులు, దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. ప్రస్తుతం ఈ ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రసిద్ధ యూట్యూబర్ (Youtuber), ఖాన్ సర్ రైల్వేస్, ఎన్డీఏ, నేవీ, సీడిఎస్, బ్యాంకింగ్ వంటి వివిధ రిక్రూట్మెంట్ పరీక్షల కోసం విద్యార్థులకు కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ అంశాలు బోధిస్తారు.
పేరు.. ఊరు తెలియదు..
విద్యార్థులు అతన్ని ఖాన్ సర్ (Khan Sir) అని పిలుస్తారు. అయితే అతని అసలు పేరు తెలియదు. ఖాన్ సర్ వీడియోలు పాట్నా లొకేషన్ చూపిస్తుంటాయి. అయితే అతను గోరఖ్‌పూర్‌కు చెందిన వాడని చాలా మంది నమ్ముతున్నారు. ఖాన్ సార్‌కు వివాదాలు కొత్త కాదు, అతను తన తరగతుల సమయంలో అనేక సమస్యలపై వ్యా ఖ్యలు చేయడంలో ఇప్పటికే చాలా పాపులర్. ఫ్రాన్స్-పాకిస్తాన్ (France - Pakistan) సంబంధాలపై చేసిన వ్యా ఖ్యలు అతనిని గత ఏడాది మే నెలలో ట్విట్టర్ (Twitter) ట్రెండింగ్ అయ్యారు కూడా..
అయితే ఈ యూట్యూబ్ సర్ వయసు, ఇతర వివరాలు ఎవ్వరికీ తెలియదు. అతను 1993లో జన్మించాడని పలు నివేదికలు చెబుతున్నాయి. ఉద్యోగార్థులతో స్థానిక భాషలో మాట్లాడే ప్రసిద్ధ ఉపాధ్యాయుడికి మొబైల్ యాప్ (Mobile APP), వెబ్సైట్ ఉన్నాయి కానీ అతని వ్యక్తగత వివరాలు లేవు. ఖాన్ సర్ తన కోచింగ్‌లో భాగంగా రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షల గురించి మాట్లాడుతాడు. రైల్వే పరీక్షలలోని లొసులగులను ఎత్తి చూపుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇది విద్యార్థులను ప్రేరేపించిందని ఆరోపణలు వస్తున్నాయి. అతనితోపాటు మరో ఐదుగురు ఉపాధ్యాయులు ఎస్కేఝా, నవీన్, అమర్నాథ్, గగన్ ప్రతాప్, గోపాల్ వర్మలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఖాన్ సర్ చేసిన వీడియోలలో ఒకటి Youtube ద్వారా తీసివేయబడింది. అయినప్పటికీ, ఆన్లైన్ ఉపాధ్యాయుడు తాను హింసను ఎప్పుడూ ప్రేరేపించలేదని పేర్కొన్నాడు, తదుపరి వీడియోలలో అతను “జాతీయదినోత్సవం అయినందున జనవరి 26 న నిరసన చేయవద్దనిద్ద విద్యార్థులను కోరడం చూడవచ్చు." రైతు నిరసనలను కూడా ఉదాహరణగా తీసుకుని విద్యార్థులు ఇదే మలుపు తీసుకుంటే వారికి మద్దతుద్ద ఇవ్వడం కష్టమష్ట వుతుందని అన్నారు.
సంఘటన తర్వా త మరొక వీడియోలో, అతను తమ భారత్ బంద్ నిరసనను విరమించుకోవాలని విద్యార్థులను కోరాడు. రైల్వే రిక్రూట్మెంట్ ఆర్ఆర్బీ సమస్యగా చూడాలని, ఇందుకు రైల్వే మంత్రి, ప్రధానిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రూప్-D రిక్రూట్మెంట్లో CBT-2ని జోడించడం ద్వారా రైల్వే మంత్రిత్వ శాఖ విద్యార్థులపై అదనపు భారాన్ని మోపిందని ఆయన గతంలో చేసిన వీడియోలకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. ఖాన్ సర్‌ను బెదిరించారని పప్పుయాదవ్ అన్నారు.
ఏం జరిగింది..
ఇటీవల ఆర్ఆర్బీ ఎన్టీపీసీ (RRB NTPC) ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితంపై అసంతృప్తితోప్తి విద్యార్థులు రైల్వే బోర్డుపైర్డు ట్విట్టర్ (Twitter)లో క్యాంపెయిన్ చేస్తున్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న వారి కంటే తక్కువ మందిన అభ్యర్థులను ఎంపిక చేశారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే బోర్డు నిర్ణయం వల్ల లక్షల్లో అభ్యర్థులు నష్టపోయారని వారు పేర్కన్నారు. అయితే రైల్వే బోర్డు మాత్రం నిబంధనల ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరిగినట్టు చెబుతోంది. అంతే కాకుండా గ్రూప్-డీ పరీక్షకు సంబంధించి ఒక్క పరీక్ష కాకుండా రెండు పరీక్షలు నిర్వహించాలని రైల్వే బోర్డు సూచించడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.