Home /News /national /

RAIL PROTESTS FIR AGAINST COACHING CENTER OWNERS 8 STUDENTS ARRESTED EVK

Rail Protests: కోచింగ్ సెంట‌ర్ య‌జ‌మానుల‌పై ఎఫ్ఐఆర్‌.. 8 మంది విద్యార్థుల‌ అరెస్ట్‌

విద్యార్థుల ఆందోళ‌న‌లు (ఫైల్‌)

విద్యార్థుల ఆందోళ‌న‌లు (ఫైల్‌)

Rail Protests | రైల్వే రిక్రూట్‌మెంట్ (Railway Recruitment) డ్రైవ్‌కు సంబంధించి గత కొన్ని రోజులుగా హింసాత్మకంగా మారిన నిరసనలలో వారి పాత్రకు సంబంధించి పాట్నాలోని పోలీసులు ఎనిమిది మందిని విద్యార్థులుగా గుర్తించి, ఆరు కోచింగ్ సెంటర్‌ల యజమానులను ఎఫ్‌ఐఆర్‌ (FIR)లో పేర్కొన్నారు

ఇంకా చదవండి ...
  రైల్వే  రిక్రూట్‌మెంట్ (Railway Recruitment) డ్రైవ్‌కు సంబంధించి గత కొన్ని రోజులుగా హింసాత్మకంగా మారిన నిరసనలలో వారి పాత్రకు సంబంధించి పాట్నాలోని పోలీసులు ఎనిమిది మందిని విద్యార్థులుగా గుర్తించి, ఆరు కోచింగ్ సెంటర్‌ల యజమానులను ఎఫ్‌ఐఆర్‌ (FIR)లో పేర్కొన్నారు. కోచింగ్‌ సెంటర్ల యాజమాన్యాలు విద్యార్థులను నిరసనలకు ప్రేరేపిస్తున్నారు అని ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. విద్యార్థులు, ట్యూటర్‌లపై వచ్చిన అభియోగాలలో IPC సెక్షన్ 120B (నేరపూరిత కుట్ర), అల్లర్లు, అధికారులపై దాడికి సంబంధించిన ఇతర అభియోగాలు ఉన్నాయి. అయితే ఎఫ్ఐఆర్ న‌మోదు చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు ట్యూటర్లలో ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ (RRB NTPC) నాన్ టెక్నికల్ పోస్టుల పరీక్షా ఫలితాలపై చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. బీహార్‌ (Bihar) లోని గయా రైల్వే స్టేషన్‌లో విద్యార్థులు ఓ ప్యాసింజర్ రైలుకు నిప్పు పెట్టారు.

  RRB Group D Exam: ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డీ ప‌రీక్ష‌ల్లో భారీ మార్పు.. ఒక‌టి కాదు.. రెండు ప‌రీక్ష‌లు!

  మరో రైలుపై రాళ్లు రువ్వారు. విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో బీహార్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గత రెండు రోజులుగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

  ఆరోప‌ణ‌లు ఖండించిన ట్యూట‌ర్‌లు..
  పోలీసుల ఆరోప‌ణ‌ల‌ను ట్యూట‌ర్‌లు ఖండించారు. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) కోసం చాలా మంది విద్యార్థులు ప‌రీక్ష రాసారు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో అర్హత సాధించాలని ఆశించారు. అయితే అనేక మంది విద్యార్థులు విజయం సాధించడంలో విఫలమ‌య్యారు. దీంతో నిర‌స‌న‌ల ఆక‌స్మికంగా ప్రారంభం అయ్యాయ‌ని అందులో త‌మ త‌ప్పు లేద‌ని వారు పేర్కొన్నారు.

  RRB Group D Exam: రైల్వే జాబ్ మీ క‌ల‌నా.. సెల‌బ‌స్ అండ్ 30 డేస్ ప్రిప‌రేష‌న్ ప్లాన్!

  చ‌ర్య‌లు స‌రికాదు..
  ఈ అరెస్టులపై ప్రతిపక్షా, NDA భాగమైన హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) నుంచి కూడా విమర్శలు వచ్చాయి. మోర్చా అధిపతి, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ట్యూటర్లపై చర్య తీసుకోకుండా పోలీసులను కోరారు. ఇలా చేస్తే మ‌రింత హింసకు దారి తీసే ప్ర‌మాదం ఉంద‌ని.. ప్రభుత్వం విద్యార్థుల‌ను శాంతించేలా మ‌రో మార్గం వెత‌కాల‌ని మాంఝీ సూచించారు.

  దీనిపై ప్రధాన ప్రతిపక్షం RJD అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ మాట్లాడుతూ: “విద్యార్థుల నిరసనలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని చూపుతున్నాయి.. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగానికి నిదర్శనం.” అంటూ వ్యాఖ్యానించారు.

  RRB NTPC Results: రైల్వే ఫ‌లితాల‌పై నిర‌స‌న‌.. స్టేషన్‌లో అభ్య‌ర్థుల ఆందోళ‌న‌.. నిలిచిపోయిన రైళ్లు

  అరెస్ట‌యిన వారు..
  అరెస్టయిన ఎనిమిది మంది విద్యార్థులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 16 మందిలో ఉన్నారు.. వారి వివ‌రాలు.. కిసాన్ కుమార్ (గిరిదిహ్, జార్ఖండ్), రోహిత్ కుమార్, రాజన్ కుమార్ మరియు విక్రమ్ కునార్ (లఖిసరాయ్, బీహార్), నరేష్, గణేష్, వికాస్, ఖేసరి, మృత్యుంజయ్, బాలేశ్వర్, పంకజ్ , విశాల్, సూరజ్, మజ్ను, వికాస్ ఛోటు మరియు ముఖేష్ (పాట్నా). వీరంతా 21 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులేనని, అయితే వారు ఆరు కోచింగ్‌ సెంటర్లకు చెందిన విద్యార్థులా కాదా అనేది నిర్ధారించ‌లేమ‌ని పోలీసులు తెలిపారు.

  ఎఫ్ఐఆర్ న‌మోదైన ట్యూట‌ర్‌లు..
  పట్రానగర్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ట్యూటర్లు: ఖాన్ సర్, ఎస్కే ఝా, నవీన్, అమర్‌నాథ్, గగన్ ప్రతాప్, గోపాల్ వర్మ. వీరిలో ఖాన్ సర్ అని పిలవబడే ఫైసల్ ఖాన్ యూట్యూబ్‌లో ప్రముఖ కోచింగ్ ఛానెల్‌ని కూడా నడుపుతున్నారు.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Bihar, Indian Railways, Railway jobs, RRB

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు