Double-Decker Train: హైస్పీడ్ డబుల్ డెక్కర్ రైలు రెడీ... ఎలా ఉందో చూడండి

Semi High Speed Double Decker Train | రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే త్వరలోనే హైస్పీడ్ డబుల్ డెక్కర్ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది.

news18-telugu
Updated: November 19, 2020, 11:20 AM IST
Double-Decker Train: హైస్పీడ్ డబుల్ డెక్కర్ రైలు రెడీ... ఎలా ఉందో చూడండి
Double-Decker Train: హైస్పీడ్ డబుల్ డెక్కర్ రైలు రెడీ... ఎలా ఉందో చూడండి (image: Indian Railways)
  • Share this:
భారతీయ రైల్వేకు చెందిన కపుర్తలలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ సెమీ హైస్పీడ్ డబుల్ డెక్కర్ రైలును తయారు చేసింది. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని భారతీయ రైల్వే ప్రకటించింది. అధునాత సౌకర్యాలు, డిజైన్‌తో ఈ కోచ్‌ను రూపొందించింది రైల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇందులో 120 సీట్లు ఉంటాయి. అప్పర్ డెక్‌లో 50 మంది ప్యాసింజర్లు, లోయర్ డెక్‌లో 48 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. మిడిల్ డెక్‌లో 16 సీట్లు ఒకవైపు, 6 సీట్లు మరోవైపు ఉంటాయి. మొత్తం 120 సీట్లు ఉంటాయి. ఈ డబుల్ డెక్కర్ రైలులో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని భారతీయ రైల్వే చెబుతోంది. లగేజ్ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ర్యాక్స్ ఉంటాయి. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ ఉంటాయి. జీపీఎస్ బేస్డ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. ఎల్ఈడీ డెస్టినేషన్ బోర్డుపై ప్రయాణికులకు కావాల్సిన సమాచారం డిస్‌ప్లే అవుతుంది.

IRCTC Kerala Tour: కేరళ టూర్ వెళ్తారా? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ రూ.5,585 మాత్రమే

IRCTC: తెలుగు రాష్ట్ర నుంచి దక్షిణ భారతదేశ యాత్ర... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

ప్రయాణికులు ఈ కోచ్ లోపలికి రావడానికి ఆటోమెటిక్ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి. ఈ డబుల్ డెక్కర్ కోచ్‌లో మినీ ప్యాంట్రీ ఉండటం విశేషం. ప్రతీ కోచ్‌లో మినీ ప్యాంట్రీ ఉంటుంది. టీ, కాఫీ, స్నాక్స్, కూల్ డ్రింక్స్ లాంటివి అందుబాటులో ఉంటాయి. ఎయిర్ స్ప్రింగ్ సస్పెన్షన్ సిస్టమ్ ద్వారా ఈ కోచ్‌ను రూపొందించడం వల్ల గాల్లో ప్రయాణిస్తున్నట్టే ఉంటుందని, అదనంగా సీసీటీవీ కెమెరాలు, ఫైర్ అండ్ స్మోక్ డిటెక్షన్ సిస్టమ్ లాంటి సేఫ్టీ, సెక్యూరిటీ ఏర్పాట్లు ప్రయాణికుల కోసం ఉన్నాయని రైల్వే ప్రకటించింది. డబుల్ డెక్కర్ కోచ్‌కు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇక్కడ చూడండి.

IRCTC Ooty Tour: ఆరు వేలకే ఊటీ హాలిడే ట్రిప్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC Coorg Tour: కూర్గ్ అందాలు చూడాలనుకుంటున్నారా? టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ


రైల్ కోచ్ ఫ్యాక్టరీ భారతీయ రైల్వే కోసం డబుల్ డెక్కర్ కోచ్‌లను రూపొందిస్తోంది. మొదటి బ్యాచ్ నాన్ ఏసీ డబుల్ డెక్కర్ రైళ్లను 1990 దశకంలోనే తయారు చేసింది. ఆ తర్వాత ఏసీ డబుల్ డెక్కర్ కోచ్‌లను తయారు చేసింది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల డబుల్ డెక్కర్ కోచ్‌లను 2010 మార్చిలో తయారు చేయడం విశేషం. ఇప్పుడు ఏకంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల డబుల్ డెక్కర్ కోచ్‌ను రూపొందించింది. ఈ కోచ్‌ను రీసెర్చ్ అండ్ డిజైన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్-RDSO లక్నోకు పంపిస్తామని, అక్కడ పరీక్షలు జరిపిన తర్వాత భారతీయ రైల్వేకు అందుబాటులోకి తీసుకొస్తామని రైల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ రవీందర్ గుప్తా తెలిపారు. ఇంకొన్ని రోజుల్లోనే హైస్పీడ్ డబుల్ డెక్కర్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Published by: Santhosh Kumar S
First published: November 19, 2020, 11:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading