స్మృతి ఇరానీ అంటే రాహుల్ భయపడుతున్నారా... ఆమెకు అంత సీన్ ఉందా?

Lok Sabha Elections : ఏటికేడు పొలిటికల్ గ్రాఫ్ పెంచుకుంటున్న స్మృతి ఇరానీ... ఇప్పుడు రాహుల్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారా?

Krishna Kumar N | news18-telugu
Updated: March 29, 2019, 6:39 PM IST
స్మృతి ఇరానీ అంటే రాహుల్ భయపడుతున్నారా... ఆమెకు అంత సీన్ ఉందా?
రాహుల్, స్మృతి ఇరానీ (File)
  • Share this:
సహజంగా వీవీఐపీలు పోటీ చేసే స్థానాలకు ప్రత్యర్థి పార్టీలు బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టవు. ఇందుకు రెండు కారణాలు. మొదటిది వీవీఐపీ కచ్చితంగా గెలుస్తారన్న ఆలోచన. రెండోది వీవీఐపీకి ఇచ్చే గౌరవం. ఎంత శత్రువైనా రాజకీయ పార్టీలు ఈ రూల్ పాటిస్తుంటాయి. కానీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విషయంలో బీజేపీ ఈ రూల్ పక్కన పెడుతోంది. రాహులైతే ఏంటి... ఓడించి తీరాల్సిందే అంటూ... బీజేపీ పవర్ బ్రాండ్ స్మృతి ఇరానీని మరోసారి రాహుల్ కంచుకోటైన అమేథీ నుంచీ బరిలో దింపింది. రాహుల్‌ని ఆమె ఓడించగలరా అంటే... కష్టమే అన్న సమాధానం స్పష్టం. ఎందుకంటే... అమేథీ నియోజకవర్గం మొదటి నుంచీ... అంటే సంజయ్ గాంధీ తరం నుంచీ కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. 2014లో దేశమంతా నరేంద్ర మోదీ మేనియా ఉన్నప్పుడు కూడా రాహుల్... ఇరానీని లక్ష ఓట్ల తేడాతో ఓడించారు. బట్... అప్పుడు ఆమె పరిస్థితి వేరు... ఇప్పుడు వేరు. రాహుల్ ఎలాగైతే ఈ ఐదేళ్లలో రాటుదేలారో... స్మృతి ఇరానీ కూడా దేశ ప్రజల్లో తన క్రేజ్ పెంచుకున్నారు. కేంద్ర మంత్రిగా ఉంటూ, అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, ప్రత్యర్థులకు బలమైన కౌంటర్లు ఇస్తూ... ఎక్కడా వెనక్కి తగ్గకుండా చెలరేగిపోయే తత్వంతో ముందుకు సాగారామె. అందువల్ల రాహుల్‌కి ఈసారి స్మృతి ఇరానీ గట్టి పోటీ ఇస్తున్నారనడంలో మనం సందేహాల్ని పక్కన పెట్టెయ్యవచ్చు.

రాజకీయాల్లో ప్రత్యర్థిని ఎక్కువ అంచనా వేసినా, తక్కువ అంచనా వేసినా ప్రమాదమే. రాహుల్ సంగతేమోకానీ... కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం... స్మృతి ఇరానీ దూకుడుపై ఒకింత భయాందోళనలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఆమె గనక రాహుల్‌ని ఓడిస్తే, అది రాహుల్ కెరీర్‌పైనే కాదు... కాంగ్రెస్ ఫ్యూచర్‌కి కూడా భారీ దెబ్బ కొట్టినట్లవుతుంది. అంతే కాదు... బీజేపీలో స్మృతీ ఇరానీ గ్రాఫ్ దూసుకెళ్తుంది. ఒకవేళ రాహుల్ ఓడిపోతే, పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండాలంటే... ఆయన మరో చోటి నుంచీ పోటీ చేసి గెలవాలనే ఆలోచనలో ఉన్నారు పార్టీ నేతలు. అందుకే కేరళ లోని వయనాడ్ నుంచీ రాహుల్ పోటీ చేయాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయని ఢిల్లీలో ప్రచారం మొదలైంది.

స్మృతీ ఇరానీకి అంత సీన్ ఉందా : దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో స్మృతి ఇరానీ ఒకరు. కేంద్ర మంత్రిగా ఆమె పెద్దగా చేసిందేమీ లేకపోయినా, వివాదాలే ఆమెకు గుర్తింపు తెస్తున్నాయి. ఎప్పుడూ ప్రజల నోళ్లలో ఆమె పేరు పలికేలా చేస్తున్నాయి. అంతమాత్రాన ఆమె రాజకీయంగా దూసుకుపోగలరని భావించలేం. ఐతే... రాహుల్‌ని ఓడించేందుకు... స్మృతి ఇరానీకి ఈసారి కొన్ని అదనపు ఆయుధాలు చేరాయి. అవేంటంటే...
* కేంద్రంలో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.
* అమేథీలో 4 అసెంబ్లీ స్థానాలుండగా... 2017లో జగదీష్‌పూర్, గౌరిగంజ్, అమేథీల్లో బీజేపీ గెలిచింది. ఇది కాంగ్రెస్‌కి షాకింగ్ సీన్.
* దేశవ్యాప్త పర్యటనల వల్ల అమేథీపై రాహుల్ ఎక్కువ ఫోకస్ పెట్టే ఛాన్స్ లేదు. స్మృతీ ఇరానీ మాత్రం రోజంతా అక్కడే ఉండి... వీలైనన్ని విమర్శలు రాహుల్‌పై చేస్తూ... కాంగ్రెస్ అధినేతపై ప్రజా వ్యతిరేకతను పెంచవచ్చు.
* 2009, 2014లో ఆమేథీ ప్రజలు ఎంతగానో ఆదరించినా, రాహుల్ ఆ స్థాయిలో అమేథీకి ఏమీ చెయ్యలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా 2014 తర్వాత రాహుల్ అమేథీని దాదాపు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ గాంధీ కుటుంబంపై అమేథీ ప్రజల్లో అభిమానం తగ్గలేదని తెలుస్తోంది.1967 నుంచీ 2014 వరకు అమేథీలో 15 సార్లు ఎన్నికలు జరగ్గా... రెండుసార్లు మాత్రమే కాంగ్రెసేతర పార్టీలు విజయం సాధించాయి. అయినప్పటికీ... టీవీ నటిగా పరిచయమై.... 2003లో బీజేపీలో చేరి... 2011లో రాజ్యసభలో అడుగుపెట్టి... కేబినెట్ మంత్రిగా మారి... వరుసగా మూడు శాఖలు నిర్వహించి... తిరుగులేని ట్రాక్ రికార్డుతో దూసుకొస్తున్న స్మృతి ఇరానీ విషయంలో రాహుల్ జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ విషయంలో కాంగ్రెస్ ఏమాత్రం తడబడినా... చరిత్రలో ఆ పార్టీ... అతి పెద్ద పొరపాటు చేసినట్లవుతుందని చెబుతున్నారు.ఇవి కూడా చదవండి :

29న ఏపీకి ప్రధాని మోదీ... ఏం చెప్తారు... ప్రత్యేక హోదాపై మాట్లాడతారా?

నామినేషన్లకు నేడే ఆఖరి రోజు... ఇప్పటివరకూ ఎన్ని వేశారు... ప్రత్యేకతలేంటి?

కన్నా, రాయపాటి, శ్రీకృష్ణ... గుంటూరు... నరసారావుపేట ఎంపీ స్థానంలో గెలిచేదెవరు?

PUBG : ఇండియాలో పబ్‌జీ ఎర్రర్ ఫిక్సైంది... ఇక ఎంతసేపైనా ఆడుకోవచ్చు...
Published by: Krishna Kumar N
First published: March 25, 2019, 6:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading