హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Sonia In Bharat Jodo Yatra : పాదయాత్రలో సోనియా 'షూ' లేస్ కట్టిన రాహుల్ గాంధీ

Sonia In Bharat Jodo Yatra : పాదయాత్రలో సోనియా 'షూ' లేస్ కట్టిన రాహుల్ గాంధీ

సోనియా షూ లేస్ కట్టిన రాహుల్ గాంధీ

సోనియా షూ లేస్ కట్టిన రాహుల్ గాంధీ

Rahul Gandhi Ties Sonia Shoe Lace : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రస్తుతం  కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సుమారు 3,570 కి.మీ మేర భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Rahul Gandhi Ties Sonia Shoe Lace : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రస్తుతం  కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సుమారు 3,570 కి.మీ మేర భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 148 రోజుల పాటు రాహుల్ నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేయాలన్నది ప్రణాళిక. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ జోడో యాత్ర ప్రారంభించారు. తమిళనాడు, కేరళలో పూర్తి చేసుకుని ప్రస్తుతం కర్ణాటకలో జోడో యాత్ర కొనసాగుతోంది. గురువారం భారత్​ జోడో యాత్ర 29వ రోజు. అయితే ఇవాళ రాహుల్‌తో క‌లిసి సోనియా గాంధీ (Sonia Gandhi)కూడా యాత్ర‌లో న‌డిచారు. గురువారం ఉదయం 6.30 గంటలకు మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని బెల్లాలే గ్రామం నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. జక్కనహళ్లి క్రాస్ దగ్గర సోనియా గాంధీ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి పాదయాత్ర చేశారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా సోనియాతో క‌లిసి ఉత్సాహంగా న‌డిచారు. యాత్ర‌లో భాగంగా వాకింగ్ చేస్తున్న స‌మ‌యంలో రాహుల్ త‌న త‌ల్లి సోనియా బూట్లకు లేస్ క‌ట్టారు. నియా గాంధీతో పాటు స్థానిక మహిళా ఎమ్మెల్యేలు అంజలి నింబాల్కర్, రూపకళ, లక్ష్మీ హెబ్బాల్కర్,కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్,మాజీ సీఎం సిద్దరామయ్య   తదితరులు భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి అడుగులు వేశారు.

సోనియాగాంధీ యాత్రలో పాల్గున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ మరింత రెట్టింపయిందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. సోనియా గాంధీ కర్ణాటకలో పాదయాత్ర చేసేందుకు రావడం తమకు గర్వకారణం అన్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్. విజయదశమి తర్వాత కర్ణాటకలో తమ పార్టీకి విజయం తథ్యమని బీజేపీ దుకాణం మూతపడుతుందని జోస్యం చెప్పారు.

Covid Update : కరోనాపై భారత్ అతిపెద్ద విజయం..దేశం నుంచి కోవిడ్ పరార్!

కాగా,భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు సోమవారమే మైసూరు చేరుకున్నారు సోనియా. దసరా రోజున(బుధవారం) బేగూర్ గ్రామంలోని భీమనకొళ్లి ఆలయంలో పూజలు చేశారు. గురువారం ఉదయం మండ్యకు చేరుకుని పాదయాత్రలో పాల్గొన్నారు. క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఇవాళ బ‌ళ్లారిలో జ‌రిగే బ‌హిరంగ‌స‌భ‌లో సోనియా మాట్లాడ‌నున్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bharat Jodo Yatra, Congress, Karnataka, Rahul Gandhi, Sonia Gandhi

ఉత్తమ కథలు