Rahul Gandhi Tweet | కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వం తనదైన శైలిలో విమర్శలు చేశారు. తాజాగా ఆయన ట్వీట్ ప్రధాని మోదీని విమర్శిస్తూ చేశారు. దేశంలో ప్రతిపక్షాల గొంతును ప్రజలకు చేరకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలను మీడియా పట్టించుకోవట్లేదని అన్నారు.
కాంగ్రెస్ (Congress) నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)బీజేపీ ప్రభుత్వం తనదైన శైలిలో విమర్శలు చేశారు. తాజాగా ఆయన ట్వీట్ ప్రధాని మోదీని విమర్శిస్తూ చేశారు. దేశంలో ప్రతిపక్షాల గొంతును ప్రజలకు చేరకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలను మీడియా పట్టించుకోవట్లేదని అన్నారు. అనేక మీడియా సంస్థలు కొందరు వ్యక్తులను మాత్రమే భుజానికి ఎత్తుకొంటున్నాయని విమర్శించారు. ప్రతీ పక్షాలకు మీడియా (Media) ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం మీరు భుజాలకెత్తుకున్న ఆ వ్య క్తి ఎప్పు డైనా మీ కోసం గొం తెత్తారా? అం టూ రాహుల్ హిం దీలో ట్వీ ట్ చేశారు. మీ మనస్సాక్షికి లోబడి ఏది ఒప్పు అనిపిస్తే అది చేయండని, మీకు అన్యా యం జరిగినా మీపై హిం సకు పాల్ప డినా గతంలో మీతో ఉన్నానని, భవిష్ త్తులోనూ మీతో ఉం టానని ట్వి టర్లో పేర్కొ న్నా రు.
दुखद!
कई मीडिया साथी सिर्फ़ एक व्यक्ति का चेहरा दिखाते हैं, विपक्ष की आवाज़ दबाते हैं- जनता तक नहीं पहुँचने देते। क्या उस व्यक्ति ने कभी आपके लिए आवाज़ उठायी?
తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రతీష్ఠాత్మకంగా తీసుకొన్నారు. పార్టీ మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో నిరంతరం ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తాజాగా ఎన్నికల వ్యూహకర్తగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్.. ఓ న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ (Interview) పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లేకుండా కూడా దేశంలో బలమైన ప్రతిపక్షాన్ని తయారు చేయవచ్చని మరోసారి పునరుద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్‌లో 2017 కంటే 2022లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పారు. భారతదేశంలోని ఏ నాయకుడితో మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటున్నారు అని ప్రశాంత్ కిశోర్’ను అడగగా.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలిసి మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తాను ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో మాట్లాడుతూనే ఉన్నానని అన్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.