హోమ్ /వార్తలు /జాతీయం /

చౌకీదార్ చోర్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన రాహుల్ గాంధీ

చౌకీదార్ చోర్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ(ఫైల్ ఫోటో)

రాహుల్ గాంధీ(ఫైల్ ఫోటో)

Lok Sabha Election 2019 : సుప్రీంకోర్టుకు సమర్పించిన మూడు పేజీల అఫిడవిట్‌లో రాహుల్ గాంధీ... చౌకీదార్ చోర్ వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పారు.

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి... చౌకీదార్ చోర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి... స్వయంగా సుప్రీంకోర్టే... నరేంద్ర మోదీని చోర్‌ (దొంగ) అందన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... చివరకు తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. తన ఆరోపణలను సుప్రీంకోర్టుకు ఆపాదించినందుకు అత్యున్నత న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చౌకీదార్ చోర్ నినాదాన్ని అందుకుంది. రాహుల్ సహా ఆ పార్టీ నేతలంతా ఎక్కడ ఎన్నికల ప్రచారం చేసినా... ప్రధాని మోదీ చౌకీదార్ కాదు... చోర్ అని విమర్శలు చేస్తున్నారు. అదే క్రమంలో రాహుల్ గాంధీ కూడా ప్రధానిని చోర్ అంటూ... స్వయంగా సుప్రీంకోర్టే అలా చెప్పిందని ప్రజల ముందు వ్యాఖ్యానించారు. రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని మోదీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు నోటీసులు పంపడంతో... వరుసగా రెండుసార్లు అఫిడవిట్లు సమర్పించిన రాహుల్ తన తప్పేమీ లేదన్నట్లు మాట్లాడారు. ఐతే... దీనిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యే అవకాశాలు కనిపించడంతో చివరకు రాహుల్... మూడోసారి అఫిడవిట్ దాఖలు చేసి... అందులో బేషరతు క్షమాపణ చెప్పారు.


    రాహుల్ చౌకీదార్ చోర్ వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టుకి ఆపాదించడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ... బీజేపీ నేత మీనాక్షీ లేఖీ కేసు ఫైల్ చేశారు. ఏప్రిల్ 10న రాఫెల్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ రాహుల్... చౌకీదార్ చోర్ (కాపలాదారే దొంగ) అన్న నినాదాన్ని సుప్రీంకోర్టే ఆమోదించిందని అన్నారు. నిజానికి సుప్రీంకోర్టు అలా ఎప్పుడూ చెప్పలేదు. అందువల్లే రాహుల్ చిక్కుల్లో పడ్డారు. కోర్టు ధిక్కరణ నోటీసులు అందుకున్నారు. చివరకు క్షమాపణ కోరడం వల్ల ఈ వివాదం ఇక్కడితే ముగిసే అవకాశాలు ఉన్నాయి.


     


    ఇవి కూడా చదవండి :


    డోర్ తెరిచాడు... పాము కాటేసింది... అసలేం జరిగిందంటే...


    బీజేపీ గెలిచినా... కేంద్రంలో అధికారంలోకి రాదా...? ఆ 21 పార్టీల ప్లాన్ ఏంటి...?


    యూపీలో బీజేపీకి షాక్ తప్పదా... మారుతున్న పరిస్థితులు... పెరుగుతున్న పార్టీల వ్యతిరేకత...


    దగ్గరవుతున్న బీజేపీ, వైసీపీ ... ఫలితాల తర్వాత పొత్తు..? ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా.. ?

    First published:

    Tags: Lok Sabha Election 2019, Rahul Gandhi, Supreme Court

    ఉత్తమ కథలు