కేరళ వరదలపై ప్రధాని మోదీతో మాట్లాడిన రాహుల్ గాంధీ

నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ(File)

వయనాడ్ సహా కేరళ రాష్ట్రంలోని వరద సమస్యలు, ప్రజలకు అందించాల్సిన సాయంపై ప్రధాని ప్రధానితో మాట్లాడానని రాహుల్ గాంధీ తెలిపారు.

  • Share this:
    కేరళలో వరదలపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వయనాడ్‌లో పరిస్థితిని రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోదీకి వివరించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ తన వయనాడ్ ఎంపీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. వయనాడ్ సహా రాష్ట్రంలోని వరద సమస్యల, ప్రజలకు అందించాల్సిన సాయంపై ప్రధానితో చర్చించానని ఆయన తెలిపారు. వరద సాయంపై ప్రధాని నరేంద్రమోదీ స్పష్టమైన హామీ ఇచ్చారని... ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారని రాహుల్ గాంధీ వెల్లడించారు.
    మరోవైపు వరదలు తగ్గుముఖం పట్టిన తరువాత వయనాడ్ నియోజకవర్గంతో పాటు కేరళలో పర్యటించేందుకు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నట్టు సమాచారం.
    First published: