హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rahul Gandhi: రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలి.. ఖర్గేకు బీజేపీ డిమాండ్

Rahul Gandhi: రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలి.. ఖర్గేకు బీజేపీ డిమాండ్

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు కూడా విమర్శలు గుప్పించారు. రాహుల్‌ గాంధీ వల్ల దేశం పరువుపోతోందని ఆయన ట్వీట్‌ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భారత సైన్యం (Indian Army)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై దేశ రాజకీయాల్లో దుమారం రేగుతోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సైన్యాన్ని అవమానించిన రాహుల్ గాంధీని పార్టీ నుంచి బహిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అటు బీజేపీపై అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది కాంగ్రెస్.  భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) వంద రోజులు పూర్తిచేసుకున్న  సందర్భంగా శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియాపై చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే..  కేంద్రం మొద్దు నిద్రపోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. రెండేళ్లుగా ఈ విషయాన్ని చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో సైనికులు దెబ్బలు తింటున్నారంటూ.. భారత ఆర్మీ నైతికతను దెబ్బతీసేలా రాహుల్ గాంధీ వ్యవహరించారని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియామండిపడ్డారు. ఆయన్ను వెంటనే పార్టీ నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను డిమాండ్ చేశారు. మల్లికార్జున ఖర్లే నిజంగా రిమోట్‌ కంట్రోల్డ్‌ అధ్యక్షుడు కాకపోతే... వెంటనే రాహుల్‌ వేయాలని ఆయన అన్నారు. ఒకవేళ రాహుల్‌ గాంధీని తొలగించకపోతే... ఆయనే పార్టీని నడిపిస్తున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కాంగ్రెస్‌ అడ్డాగా మారిందని.. రాహుల్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని గౌరవ్ భాటియా స్పష్టంచేశారు.

Farmers Income: రైతుల ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇవే.. తెలంగాణ , ఏపీ పరిస్థితి ఇదీ

రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు కూడా విమర్శలు గుప్పించారు. రాహుల్‌ గాంధీ వల్ల దేశం పరువుపోతోందని ఆయన ట్వీట్‌ చేశారు. రాహుల్‌తో కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే కాదు... దేశం మొత్తానికి ఇబ్బంది అని విమర్శించారు.

బీజేపీపై అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది కాంగ్రెస్. మోదీజీ.. చైనా పే చర్చ ఎప్పుడు అని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సెటైర్లు వేశారు. డోక్లాం ప్రాంతంలోని జంఫేరి పర్వతశ్రేణి వరకు చైనా ఆక్రమణలు చేపట్టిందని.. ఐనా మోదీ ప్రభుత్వం నిద్రపోతోందని ఆయన విరుచుకుపడ్డారు.

ప్రస్తుతం ఈ వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాహుల్ గాంధీని పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంటే.. తాము చెప్పేవని నిజమని బీజేపీపై ఎదురుదాడికి దిగుతోంది కాంగ్రెస్.

First published:

Tags: Bjp, Congress, Indian Army, Rahul Gandhi

ఉత్తమ కథలు