RAHUL GANDHI SECURITY BREACH FLAG THROWN AT HIS CAR IN PUNJAB PVN
Security Breach : రాహుల్ పర్యటనలో భద్రతా లోపం..దాడికి యత్నించిన యువకుడు
రాహుల్ గాంధీ ( పైల్)
Rahul Security Breach : రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. ఈ ఘటన తర్వాత భద్రతలో ఉన్న అధికారులంతా ఉలిక్కిపడ్డారు. ఘటన సమయంలో రాహుల్ వెంట సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ,పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఉన్నారు.
Rahul Gandhi Security Breach : ఇటీవల ప్రధాని పంజాబ్ పర్యటనకు వెళ్లిన సమయంలో తలెత్తిన భద్రతా లోపం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విఫయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే రాష్ట్రానికి పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. పంజాబ్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు రాహుల్ గాంధీ ఆదివారం లుధియానా వెళ్లే సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారుపైకి ఓ యువకుడు నల్ల జెండా విసిరేశాడు.
లుధియానా జిల్లాలోని హల్వారా నుంచి లుధియానాకు వెళ్లే క్రమంలో హర్షిలా రిసార్ట్ దగ్గరకు రాహుల్ రాగానే కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ కి ఘన స్వాగతం పలికాయి. దీంతో కారు అద్దాలు తీసి రాహుల్ అభివాదం చేశారు. ఈ సమయంలోనే ఓ యువకుడు రాహుల్ పై ఎటాక్ చేయడానికి ప్రయత్నించాడు. ఓ జెండాను రాహుల్ కారుపైకి విసిరాడు. అది రాహుల్ గాంధీ ముఖానికి తగిలింది, కానీ అతనికి ఎలాంటి గాయం కాలేదు. రాహుల్ వెంటనే కిటికీ అద్దాలు మూసేశారు. ఈ సంఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
ఘటన సమయంలో రాహుల్ వెంట సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ,పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఉన్నారు. రాహుల్ ప్రయాణిస్తున్న కారును కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్ జఖార్ డ్రైవ్ చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత భద్రతలో ఉన్న అధికారులంతా ఉలిక్కిపడ్డారు. జెండా విసిరిన యువకుడు నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) కార్యకర్త అని,అతను జమ్మూ కాశ్మీర్ వాసి అని, ఆవేశంతో రాహుల్ గాంధీ వైపు జెండాను విసిరినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.