హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rahul Gandhi | ED : సత్యాగ్రహ ర్యాలీగా ఈడీ ముందుకు రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతల అరెస్టులు

Rahul Gandhi | ED : సత్యాగ్రహ ర్యాలీగా ఈడీ ముందుకు రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతల అరెస్టులు

ర్యాలీగా ఈడీ కార్యాలయానికి వెళుతోన్న రాహుల్ గాంధీ

ర్యాలీగా ఈడీ కార్యాలయానికి వెళుతోన్న రాహుల్ గాంధీ

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం నాడు కేంద్ర సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. లాయర్లను లోనికి అనుమతించకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగగా పోలీసులు అరెస్టు చేశారు. వివరాలివి..

ఇంకా చదవండి ...

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)  సోమవారం నాడు కేంద్ర సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) (ఈడీ) విచారణకు హాజరయ్యారు. అన్ లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) పేరుతో తప్పు దారిలో వడ్డీ లేని రుణాలు పొందారనే ఆరోపణలకు సంబంధించిన ‘నేషనల్ హెరాల్డ్’ (National Herald corruption case) కేసులో రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సైతం నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిని కుట్రపూరిత కేసుగా అభివర్ణిస్తోన్న కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ ను ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది.

బీజేపీ సర్కార్ కుటిల రాజకీయాలకు భయపడేదే లేదని, ధైర్యంగా విచారణకు వస్తానన్న రాహుల్ గాంధీ ఆమేరకు ఇవాళ సత్యాగ్రహ ర్యాలీ ద్వారా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ర్యాలీలో రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీతోపాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించిన పోలీసులు.. రాహుల్ వెంట వచ్చి ఆందోళనలు నిర్వహించిన పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు.

CM KCR | BRS : కేసీఆర్ అనూహ్యం.. ప్రాంతీయ ఫార్ములాతోనే జాతీయ పార్టీ -ఎన్టీఆర్‌, పీవీ బొమ్మలతో..


నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ముగ్గురు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన రాహుల్ గాంధీని అధికారులు ఎంత సేపు ప్రశ్నిస్తారనేది ఉత్కంఠగా మారింది. రాహుల్ వెంట లాయర్లను లోపలికి అనుమతించకపోవడంపైనా కాంగ్రెస్ మండిపడింది. లాయర్లను అనుమతించాల్సిందేనంటూ నిరసనలకు దిగిన బడా నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

National Family Survey : భర్తలు కొట్టినా పర్వాలేదు : తెలుగు మహిళల్లో 83 శాతం మంది మాటిదే!


ఈడీ కార్యాలయం వద్ద రెండంచెల భద్రతను దాటుకొని మరీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దూకుడు ప్రదర్శించారు. అరెస్టయిన కాంగ్రెస్ నేతల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులున్నారు. అనేక మంది కాంగ్రెస్ నేత‌ల్ని వేరువేరు చోట్ల అరెస్టు చేశారు. రాహుల్ ఈడీ ఆఫీసులోకి ఎంటరైన తర్వాత ప్రియాంకా గాంధీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

First published:

Tags: Congress, Delhi, Enforcement Directorate, Rahul Gandhi

ఉత్తమ కథలు