బ్యాలెట్ వైపు రాహుల్ చూపు... అసెంబ్లీ ఎన్నికల్ని బహిష్కరిస్తారా?

Rahul Gandhi : లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ నమ్మలేకపోతున్నారా... ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని భావిస్తున్నారా? మళ్లీ బ్యాలెట్ విధానం తేవాలని ఆయన ఆందోళనకు దిగబోతున్నారా?

Krishna Kumar N | news18-telugu
Updated: June 24, 2019, 6:06 AM IST
బ్యాలెట్ వైపు రాహుల్ చూపు... అసెంబ్లీ ఎన్నికల్ని బహిష్కరిస్తారా?
రాహుల్ గాంధీ (Image : Twitter / rubika liyaquat)
  • Share this:
లోక్ సభ ఎన్నికల ఫలితాల్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంగీకరించలేకపోతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత ఉంటే... లోక్ సభ ఎన్నికల్లో 2014లో కంటే ఎక్కువ స్థానాలు 2019లో రావడం వెనక ఈవీఎంల హ్యాకింగ్ ఉందని రాహుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవీఎంలను పూర్తిగా పక్కన పెట్టి... సంప్రదాయ విధానమైన బ్యాలెట్ సిస్టం తేవాలని ఆయన ఆందోళనకు దిగబోతున్నట్లు ఢిల్లీ AICC వర్గాల నుంచీ తెలుస్తోంది. నిజానికి ఫలితాల తర్వాత ఆత్మ పరిశీలన చేసుకున్న రాహుల్... అసలు తాను కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి సెట్ కాననీ, తాను ఆ పదవిలో కొనసాగననీ పట్టుపట్టారు. యాజ్ యూజువల్‌గా పార్టీ నేతలంతా ఆయనే కొనసాగాలని కోరారు. అది నచ్చని రాహుల్ కొన్ని రోజులు విదేశాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా ముభావంగా ఉంటూ... మొబైల్‌ చూసుకుంటూ గడిపారు. తాజాగా ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈవీఎంలను తప్పుపడుతూ ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ విధానం తేవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనకు రాహుల్ దిగబోతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఆయన ఈ ఏడాది చివర్లో మూడు రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌.... నాలుగోదైన జమ్మూకాశ్మీర్ విషయం తేలాల్సి ఉంది) జరిగే అసెంబ్లీ ఎన్నికల్ని బహిష్కరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టైమ్ వేస్టేనా? : రాహుల్ ఆవేశంగా ఈ నిర్ణయం తీసుకున్నా... పార్టీ నేతలు ఇందుకు పాజిటివ్‌గా లేరని తెలుస్తోంది. కారణం... ఈవీఎంలు పక్కాగా పనిచేసినట్లు రుజువు కావడమే. మొన్నటి ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రతీ నియోజకవర్గం నుంచీ ఐదు వీవీప్యాట్ యంత్రాల్లో స్లిప్పులనూ, ఈవీఎంలలో వేసిన ఓట్లనూ సరిపోల్చారు. 100 శాతం కరెక్టని తేలింది. అంటే ఈవీఎంలు హ్యాక్ కానట్లే. ప్రజలు ఇచ్చిన తీర్పే అది. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇంత జరిగినా రాహుల్ మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన నిర్ణయంపై పార్టీ నేతలే కాదు... యూపీఏ అధ్యక్షురాలు, రాహుల్ తల్లి సోనియా గాంధీ కూడా పాజిటివ్‌గా లేరని తెలుస్తోంది. ఇలాంటి అనవసరపు రాద్ధాంతాలు చెయ్యడం వల్ల ప్రజల్లో ఉన్న కాస్త పేరు కూడా పోతుందని పార్టీలో సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

First published: June 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>