రాహుల్ ట్విస్ట్ ఇచ్చారే.. అందుకు ఇంకా ఛాన్స్ ఉందని కామెంట్..

కాంగ్రెస్ ఓటు బ్యాంకు పడిపోయిందని, హిందువులు ఆ పార్టీకి ఓటు వేసేందుకు సిద్దంగా లేరని చెప్పారు. ఇక ముస్లింలు కన్ఫ్యూజన్‌లో ఉన్నారని.. మొత్తంగా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు 5శాతానికి మించదని కేజ్రీవాల్ అన్నారు.

news18-telugu
Updated: April 24, 2019, 9:19 AM IST
రాహుల్ ట్విస్ట్ ఇచ్చారే.. అందుకు ఇంకా ఛాన్స్ ఉందని కామెంట్..
రాహుల్ గాంధీ (File)
news18-telugu
Updated: April 24, 2019, 9:19 AM IST
ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించి ఆప్ పొత్తు ఆశలపై నీళ్లు జల్లిన కాంగ్రెస్.. అప్పుడే కథ ముగియలేదని ట్విస్ట్ ఇచ్చింది. చివరి సెకండ్ వరకు ఆప్‌తో పొత్తుకు తమ తలుపులు తెరిచే ఉంటాయని తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. అయితే హర్యానాలో పొత్తు మాత్రం కుదరదని.. అందుకు ఒప్పుకుంటేనే ఢిల్లీలో పొత్తుకు సిద్దమని మెలిక పెట్టారు. నవభారత్‌ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తుకు కేజ్రీవాలే 4:3(ఆప్-4, కాంగ్రెస్-3) ఫార్ములాతో ముందుకొచ్చారు. మొదట మా పార్టీ నేతలు అందుకు అంగీకరించలేదు. అయితే వారికి నచ్చజెప్పాక ఒప్పుకున్నారు. అదే సమయంలో కేజ్రీవాల్ హర్యానాలోనూ పొత్తుకు ప్రతిపాదన చేశారు. కానీ హర్యానాలో పొత్తు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటే.. ఢిల్లీలో పొత్తు గురించి ఆలోచిస్తాం.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు


అయితే ఆమ్ ఆద్మీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. హర్యానాలో బీజేపీ 10కి 10సీట్లు గెలుచుకోలగదని.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ కలిసి పోటీ చేస్తే.. కనీసం రెండు స్థానాల్లో అయినా బీజేపీని నిలువరించవచ్చునని చెబుతున్నారు. కాంగ్రెస్ మాత్రం తాము సొంతంగానే బీజేపీని నిలువరించగలమన్న ధీమాలో ఉంది.

కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాక.. ఆ పార్టీపై కేజ్రీవాల్ విమర్శలు చేశారు. నిజానికి ఆ పార్టీకి ఢిల్లీలో మూడు సీట్లను గెలుచుకునే సత్తా కూడా లేదన్నారు. కాంగ్రెస్‌కు ఆ మూడు సీట్లు ఇవ్వడమంటే పరోక్షంగా బీజేపీకి బహుమతి ఇవ్వడమే అన్నారు. తమ వద్ద రెండు ఆప్షన్స్ ఉన్నాయని.. ఒకటి 4:3 ఫార్ములా అయితే.. మరొకటి మొత్తం 7సీట్లలో తామే పోటీ చేయాలన్న ఫార్ములా అని చెప్పారు. కాంగ్రెస్‌కు 3సీట్లు అప్పగిస్తే.. బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోతాయని.. అదే తాము సొంతంగా 7 స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాలను దక్కించుకోవచ్చని అన్నారు.కాంగ్రెస్ ఓటు బ్యాంకు పడిపోయిందని, హిందువులు ఆ పార్టీకి ఓటు వేసేందుకు సిద్దంగా లేరని చెప్పారు. ఇక ముస్లింలు కన్ఫ్యూజన్‌లో ఉన్నారని.. మొత్తంగా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు 5శాతానికి మించదని అన్నారు. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్‌తో పొత్తు కోసం ప్రయత్నించి విఫలమైన కేజ్రీవాల్.. ఆ పార్టీపై ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా ఆప్‌తో పొత్తుకు ఇంకా ఛాన్స్ ఉంది అని రాహుల్ చెప్పడం.. ఢిల్లీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...