Rahul Gandhi goes to Bangkok : ఈ నెల చివర్లో ఎన్నికలు జరగబోయే... మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఇలాంటి సమయంలో... పోరాడాల్సిన ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ... శనివారం సడెన్‌గా బ్యాంకాక్ ట్రిప్‌కి వెళ్లిపోయినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీయే అధికారంలో ఉంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కూడా రెండు రాష్ట్రాల్లో బీజేపీయే దుమ్మురేపింది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తోడుగా ఉంటూ... పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉంది. ఆల్రెడీ మొన్నటిదాకా పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉన్నందువల్ల... నేతలు కూడా రాహుల్ సరైన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తుంటే... ఆయనేమో... బ్యాంకాక్ వెళ్లిపోవడం... రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది.
#Bangkok #RahulGandhi not alone 😉💃honey🌒 pic.twitter.com/dJR3g1Mn5n
— 🌸𝑹𝒊𝒚𝒂💙 (@RealpolitikRiya) October 5, 2019
జీ మీడియా సోర్స్ ప్రకారం... రాహుల్ గాంధీ అక్టోబర్ 10న తిరిగి వస్తారని తెలుస్తోంది. ఒకవేళ రాహుల్ 10న వచ్చినా... పార్టీలో సీనియర్ నేతల వరుస రాజీనామాలు... అధిష్టానానికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతుంటే... ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలోకి జారిపోతోంది హైకమాండ్. పార్టీలో టికెట్ల కేటాయింపు వివక్షాపూరితంగా సాగుతోందంటూ... అధినేత్రి సోనియాగాంధీ ఇంటిముందు ధర్నా చేసిన హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వార్... పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఇకపై సాధారణ కార్యకర్తగా మాత్రమే ఉంటానని ప్రకటించారు. అశోక్ తన్వార్‌కి... రాహుల్ గాంధీతో సత్సంబంధాలున్నాయి. అలాంటి ఆయనే పార్టీ సభ్యత్వానికి గుడ్ బై చెప్పడం కలకలం రేపింది.
Rahul gandhi flying to #Bangkok pic.twitter.com/GfKz0ZtSM8
— आज का चाणक्य 🙏😎 (@rj_ravijangir) October 5, 2019
మహారాష్ట్రలోనూ అంతే. కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరుపం... తన మద్దతుదారుకు టికెట్ ఇవ్వకపోతే... తాను పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని తెలిపారు. హైకమాండ్‌కి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదని ఆయన అనడాన్ని బట్టీ... మహారాష్ట్ర కాంగ్రెస్‌లో ఎంత గందరగోళం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో బీజేపీ-శివసేన కూటమి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో అడుగులు వేస్తోంది.
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు... అక్టోబర్ 21న జరగనున్నాయి. ఫలితాలు అక్టోబర్ 24న రానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Haryana, Maharashtra, Rahul Gandhi