2019 టార్గెట్‌గా కర్నాటక కేబినెట్ కూర్పు..!

ప్రభుత్వం ఏర్పడిన రెండు వారాల తర్వాత నేడు 20 మందికి పైగా కర్నాటక మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జేడీఎస్‌ తరపున 9, కాంగ్రెస్ నుంచి 12 మందికి కేబినెట్ పదవులు దక్కినట్లు సమాచారం. 

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 1:32 PM IST
2019 టార్గెట్‌గా కర్నాటక కేబినెట్ కూర్పు..!
రాహుల్ గాంధీతో కర్నాటక సీఎం కుమారస్వామి (file photo-PTI)
  • News18
  • Last Updated: June 6, 2018, 1:32 PM IST
  • Share this:
కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య పదవుల పంపకం పూర్తయింది. ఇద్దరు సభ్యులతో ఉన్న కేబినెట్‌ను సీఎం కుమారస్వామి ఇవాళ విస్తరించనున్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు వారాల తర్వాత నేడు 20 మందికి పైగా కర్నాటక మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జేడీఎస్‌ తరపున 9, కాంగ్రెస్ నుంచి 12 మందికి కేబినెట్ పదవులు దక్కినట్లు సమాచారం.  2019 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు కర్నాటక మంత్రివర్గాన్ని కూర్పు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మంగళవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. మంత్రి పదవుల పంపకంపై కీలక చర్చలు జరిపారు. భేటీలో మాజీ సీఎం సిద్దరామయ్య,  డిప్యూటీ సీఎం పరమేశ్వర, దినేశ్ గుండరావు, శివకుమార్ పాల్గొన్నారు. నేతలతో చర్చల అనంతరం కాంగ్రెస్ నుంచి మంత్రుల లిస్టును రాహుల్ గాంధీ ఫైనల్ చేశారు. ఐతే కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రకటన లేకున్నప్పటికీ 12 మంది లిస్టును ఖరారు చేసినట్లు విశ్వసనీయర సమాచారం.

కర్నాటక కేబినెట్‌లో రెండు నుంచి మూడు పదవులను ఖాళీగానే ఉంచుతారని సమాచారం. శాఖల కేటాయింపులపై నేతల్లో అసంతృప్తి ఉండే వారికి వేరే శాఖను కేటాయించేందుకు కొన్ని శాఖలను ఖాళీగా ఉంచినట్లు తెలుస్తోంది. బీఎస్పీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఎన్ మహేశ్‌కు సైతం మంత్రివర్గంలో కీలక స్థానం లభిస్తుందని జేడీఎస్ ప్రధాన కార్యదర్శి డానిష్ అలీ వెల్లడించారు. మంత్రుల ప్రమాణస్వీకారాని బీఎస్పీ పార్టీ నేతలు  హాజరవుతారని తెలిపారు. యూపీ కాకుండా ఇతర రాష్ట్రాల్లో బీఎస్పీ నేత మంత్రి పదవి చేపట్టనుండడం ఇదే మొదటి సారి.

ఇరు పార్టీల ఒప్పందం ప్రకారం కాంగ్రెస్‌కు హోంశాఖ, నీటి పారుదల, బెంగళూరు సిటీ డెవలప్‌మెంట్, ఇండస్ట్రీ మరియు షుగర్ ఇండస్ట్రీ, ఆరోగ్యశాఖ, రెవిన్యూ శాఖ, అర్బన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, వ్యవసాయశాఖ, న్యాయ మరియు పార్లమెంటరీ వ్యవహారాలు, ఐటీ శాఖ దక్కనున్నట్లు తెలుస్తోంది. అటు జేడీఎస్‌కు ఆర్థికశాఖ, ఎక్సైజ్, సమాచారం, ఇంటెలిజెన్స్, పీడీఎస్, విద్యుత్, సహకార,పర్యాటక, విద్యా, రవాణా శాఖ పోర్ట్‌పోలియోలు కేటాయించినట్లు సమాచారం.

మే 23న సీఎంగా కుమారస్వామి, డిప్యూటీ సీఎంగా పరమేశ్వర మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ ఇతర కేబినెట్ ‌మంత్రులు ప్రమాణస్వీకాారం చేయనున్నారు. మధ్యాహ్నం 02:12 గంటలకు రాజ్‌భవన్‌ కొత్త మంత్రుల చేత గవర్నర్ వాజుభాయ్ ప్రమాణస్వీకారం చేయిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Published by: Shiva Kumar Addula
First published: June 6, 2018, 10:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading