Rahul gandhi disqualified as MP: కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఎంపీ పదవి కోల్పోయారు. పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో ఆయన ఎంపీగా అనర్హుడయ్యాడు. ఇవాళ లోక్ సభ(Loksabha)..రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించింది. ఈ మేరకు అధికార నోటిఫికేషన్ విడుదల చేసింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని వయానాడ్ నుంచి పోటీ చేసి రాహుల్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
2019 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ 2019లో సూరత్ కోర్టులో నేరపూరిత పరువు నష్టం దావా వేశారు. ఈకేసులో రాహుల్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉండటంతో తాజాగా సూరత్ కోర్టు రాహుల్ ని దోషిగా తేల్చింది. రాహుల్ కి 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అయితే, ఈ తీర్పుపై పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు రాహుల్ గాంధీకి అవకాశం ఇచ్చింది. దొంగలందరికి ఇంటి పేరు మోదీ అని ఎందుకు వచ్చిందని కర్ణాటక రాష్ట్రం కోలార్ లో ర్యాలీ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోఈ కామెంట్ చేశారు. ఆ కాంట్రవర్సీ కామెంట్స్ ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి.
నేర నిరూపణ అయితే, ఎంపీలు తమ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం - 1951 ప్రకారం.. పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి, కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హతకు గురవుతారు. ఈ నేపథ్యంలో సూరత్ కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకొని లోక్‌సభ రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించింది. అయితే, ఈ తీర్పుపై పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు రాహుల్ గాంధీకి అవకాశం ఇచ్చింది. ఈ కేసులో సూరత్ కోర్ట్ ప్రస్తుతానికి కోర్టు రాహుల్.. 30 రోజుల బెయిల్ ఇచ్చినా తర్వాత ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాబోతున్నాయి. పై కోర్టులు కనుక సూరత్ కోర్ట్ తీర్పును కొట్టేయకపోతే రాహుల్ ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. అయితే సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
రాహుల్‌పై సూరత్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మ్లలికార్జున ఖర్గే చెప్పారు. రాహుల్ నోరు నొక్కడానికే ఇలా చేశారని విమర్శించారు. మరోవైపు పరువు నష్టం కేసు(defamation case)లో తనకు రెండేళ్ల జైలు శిక్ష పడటంపై రాహుల్ స్పందించారు. సత్యమే తనకు గురువని చెప్పారు. తన ధర్మం సత్యం, అహింసలపై ఆధారపడిందన్నారు. మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కోర్టు తీర్పును స్వాగతించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rahul Gandhi