మోడీ 100 రోజుల పాలనపై రాహుల్ ట్వీట్...

ప్రజాస్వామ్యం అణచివేత, మీడియా గొంతు నొక్కుతూ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ నానాటికీ క్షీణించడానికి మోడీ నాయకత్వ లోపమే కారణమని ఆరోపిస్తూ రాహుల్ ట్వీట్ ద్వారా విమర్శించారు.

news18-telugu
Updated: September 8, 2019, 11:15 PM IST
మోడీ 100 రోజుల పాలనపై రాహుల్ ట్వీట్...
రాహుల్ గాంధీ (Image : Twitter / Reuters India)
  • Share this:
ప్రధాని నరేంద్ర మోడీ వంద రోజుల పాలన పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఎలాంటి అభివృద్ధి లేకుండా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న మోడీ ప్రభుత్వానికి అభినందనలు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యం అణచివేత, మీడియా గొంతు నొక్కుతూ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ నానాటికీ క్షీణించడానికి మోడీ నాయకత్వ లోపమే కారణమని ఆరోపిస్తూ రాహుల్ ట్వీట్ ద్వారా విమర్శించారు. అలాగే రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు సమయం అంతా వెళ్లబుచ్చారని, ఆ సమయాన్ని పాలనపై కేంద్రీకరిస్తే మంచిదని రాహుల్ హితవు పలికారు.

First published: September 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading