మోదీని టార్గెట్ చేయబోయి మరోసారి అడ్డంగా బుక్కయిన రాహుల్ గాంధీ

మోడిలీ (Modilie) అనే పదం ఇంగ్లీష్‌లో ఉందంటూ ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ... దాని అర్థం పదే పదే అబద్ధాలు చెప్పడం అని కామెంట్ చేశారు.

news18-telugu
Updated: May 17, 2019, 11:21 AM IST
మోదీని టార్గెట్ చేయబోయి మరోసారి అడ్డంగా బుక్కయిన రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ (File)
news18-telugu
Updated: May 17, 2019, 11:21 AM IST
కొద్దిరోజుల క్రితం మోదీని విమర్శించే క్రమంలో సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... తప్పని పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి మోదీని వెరైటీగా టార్గెట్ చేయబోయి నెటిజన్లకు టార్గెట్ అయ్యారు కాంగ్రెస్ అధ్యక్షుడు. మోడిలీ (Modilie) అనే పదం ఇంగ్లీష్‌లో ఉందంటూ ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ... దాని అర్థం పదే పదే అబద్ధాలు చెప్పడం అని కామెంట్ చేశారు. ఈ పదం ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యిందంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అయితే దీనిపై ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ అధికారికంగా స్పందించింది.

అసలు మోడిలీ అనే పదం ఇంగ్లీష్‌లో లేనేలేదని... ఇదంతా ఫేక్ అని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ ఈ పదం ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ పేర్కొందనే విషయం చెప్పకపోయినా... ఇంగ్లీష్‌లో లేని ఈ పదం వైరల్ కావడంపై ఆక్స్ ‌ఫర్డ్ డిక్షనరీ సంస్థ స్పందించడం గమనార్హం. మరోవైపు రాహుల్ గాంధీ మోడిలీ ట్వీట్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017లో ఇదే రకంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని టార్గెట్ చేస్తూ జెట్లీ(Jetlie) అని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ.
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...