Home /News /national /

RAHUL GANDHI AT CAMBRIDGE UNIVERSITY SINGLE BIGGEST LEARNING EXPERIENCE OF MY LIFE WAS MY FATHER DEATH PVN

Rahul Gnadhi : తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

Rahul Gandhi at Cambridge University : యూకే పర్యటలో భాగంగా కాంగ్రెస్(Congress)అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)..సోమవారం కేంబ్రిడ్జి యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

Rahul Gandhi at Cambridge University : యూకే పర్యటలో భాగంగా కాంగ్రెస్(Congress)అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)..సోమవారం కేంబ్రిడ్జి యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. లండన్ లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జి వర్సిటీలో కార్పస్‌ క్రిస్టి కాలేజీ ఆధ్వర్యంలో "ఇండియా ఎట్‌ 75" పేరిట జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మరణం జీవితంలో తనకు అతి పెద్ద అనుభవ పాఠమని ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ అన్నారు. నాన్న మరణం తనకెన్నో విషయాలు నేర్పిందన్నారు. ఒక కొడుకుగా తండ్రిని కోల్పోవడం చాలా బాధ కలిగించిందని అన్నారు. తన జీవితంలో అతిపెద్ద అనుభవం అదేనని చెప్పారు.

రాహుల్ మాట్లాడుతూ...""వ్యక్తిగతంగా నా తండ్రి హత్య విషయంలో చాలా బాధను అనుభవించా. కానీ, అదే ఘటన నాకు జీవితంలో చాలా నేర్పింది. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ప్రజలు ఎంత దారుణంగా ఉన్నా.. అది మనకు సమస్య కాదు. మోదీ నాపై విమర్శలు చేస్తే ఆయన నాపై మాటల దాడి చేస్తున్నాడని అనుకోవడం ఓ మార్గమైతే.. ఆయన నుంచి ఏదైనా నేర్చుకోవచ్చు అనుకునేది ఇంకో మార్గం"అని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే యువతకు కీలక సూచనలు చేశారు రాహుల్ గాంధీ. రాజకీయాలు చాలా క్లిష్టమైనవని అన్నారు. మంచిగా పనిచేస్తే మరింత బాధాకరంగా అనిపిస్తాయన్నారు. ఈ కఠినమైన పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అన్నారు.

ALSO READ  Travel and Tourism : అంతర్జాతీయ పర్యాటక సూచీ..దక్షిణాసియాలో భారత్ నెం.1

భారత ప్రత్యేకతను చాటే కీలక వ్యవస్థలపై ప్రణాళికాబద్ధ దాడి జరుగుతోందని ఈ సందర్భంగా రాహుల్ ఆరోపించారు. కీలక వ్యవస్థల గొంతు నొక్కేసి, ఆ స్థానంలోకి ప్రవేశించిన తెరవెనుక శక్తులు, తమ సొంత బాణీని వినిపిస్తున్నాయన్నారు. హిందూ జాతీయవాదం, కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబం పాత్ర తదితరాలపై విద్యార్థులు, భారత సంతతి వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. దేశానికి ఆత్మగా భావించే కీలకమైన పార్లమెంట్, ఎన్నికల సంఘం, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఒకే సంస్థ గుప్పిట్లో ఉంచుకుందని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. "ప్రధాని మోదీ చెప్పే దార్శనికత దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను సమ్మిళితం చేసేది కాదు. 20 కోట్ల మంది ప్రజలను ఏకాకులుగా మారుస్తూ వారిని దుష్టులుగా చిత్రీకరించడం అత్యంత ప్రమాదకరం" అని ముస్లింలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ విధానాలపై అవసరమైతే జీవితకాలం పోరాడతామన్నారు.

మరోవైపు, యూకే పర్యటలో ఉన్న రాహుల్ గాంధీ..బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు, లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్​ను సోమవారం లండన్ లో కలిశారు. భారతీయ ప్రవాస కాంగ్రెస్ ఈ ఫొటోను షేర్ చేసింది. అయితే జెరెమీ కార్బిన్​ను రాహుల్ గాంధీ కలవడం దేశంలో రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి కారణం జెరెమీ కార్బిన్ గ‌తంలో భార‌త్ వ్య‌తిరేక‌, హిందూ వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేశారు. 2015 నుంచి 2020 మధ్య బ్రిటన్ పార్లమెంట్​లో విపక్ష నేతగా పనిచేసిన జెరెమీ.. పలు విషయాల్లో భారత్​కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. భార‌త్ నుంచి క‌శ్మీర్‌ను వేరుచేయాల‌ని కూడా ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు. అటువంటి వ్యక్తిని రాహుల్ కలవడాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: London, Rahul Gandhi, Rajiv Gandhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు