Home /News /national /

RAHUL AND PRIYANKA GANDHI HITS BACK AT PM MODI ON HIS REMARKS AGAINST RAJIV GANDHI BA

రాజీవ్ గాంధీపై మోదీ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ, ప్రియాంక కౌంటర్

రాహుల్, మోదీ

రాహుల్, మోదీ

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాజీవ్ గాంధీ మీద ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    రాజీవ్ గాంధీ మీద ప్రధాని మోదీ చేసిన విమర్శలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంకా వాద్రా బదులిచ్చారు. ‘రాజీవ్ గాంధీ జీవితం అవినీతి నెం.1‌గా ముగిసిపోయింది’ అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తమ తండ్రి, మాజీ ప్రధానిపై చేసిన కామెంట్స్‌కు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా కౌంటర్ ఇచ్చారు. ‘మోదీ జీ యుద్ధం ముగిసింది. మీ కర్మ ఎదురుచూస్తోంది. మీ గురించి మీ అంతర్గత నమ్మకాలను మా నాన్న మీద ప్రొజెక్ట్ చేయాలని చూసినా అవి మిమ్మల్ని రక్షించలేవు. ప్రేమతో ఓ హగ్.’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.



    మరోవైపు ప్రియాంకా గాంధీ వాద్రా కూడా మోదీ మీద విమర్శలు గుప్పించారు. చనిపోయిన వారి పేరుతో ఓట్లు అడుగుతున్నారని ఆయనకు అమేథీ ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని ట్వీట్ చేశారు.



    ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాజీవ్ గాంధీ మీద ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ డీల్ మీద తనను విమర్శిస్తున్న రాహుల్ గాంధీని ఉద్దేశించి.. ‘మీ నాన్నను మిస్టర్ క్లీన్ అంటూ ఆయన భజనపరులు అంటుంటారు. కానీ, ఆయన జీవితం అవినీతి నెంబర్ 1గా ముగిసింది.’ అని మోదీ వ్యాఖ్యానించినట్టు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
    First published:

    Tags: Lok Sabha Election 2019, Pm modi, Priyanka Gandhi, Rahul Gandhi

    తదుపరి వార్తలు