Home /News /national /

RAGHAVA LAWRENCE REQUEST TO SUJITH PARENTS TO ADOPT A CHILD MS

అలా చేస్తే ఖర్చు నేను భరిస్తా.. సుజిత్ తల్లిదండ్రులకు లారెన్స్ విజ్ఞప్తి..

రాఘవ లారెన్స్,సుజిత్ మృతదేహం వద్ద రోధిస్తున్న కుటుంబ సభ్యులు

రాఘవ లారెన్స్,సుజిత్ మృతదేహం వద్ద రోధిస్తున్న కుటుంబ సభ్యులు

Raghava Lawrence request to Sujith Parents : సుజిత్ మృతి పట్ల కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.సుజిత్ మృతి పట్ల యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయిందని.. చిన్నారి మృతికి చింతిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి ...
    తమిళనాడులోని తిరుచ్చిలో బోరుబావిలో పడ్డ చిన్నారి సుజిత్ కథ విషాదాంతమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సుజిత్ మృతి పట్ల కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.సుజిత్ మృతి పట్ల యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయిందని.. చిన్నారి మృతికి చింతిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో చిన్నారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. సుజిత్ లేని లోటును తీర్చేందుకు.. వీలైతే ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు ఓకె చెబితే.. ఆ బిడ్డ చదువులకు అవసరమయ్యే డబ్బును తాను భరిస్తానని చెప్పారు.లారెన్స్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లారెన్స్ ప్రతిపాదనకు సుజిత్ తల్లిదండ్రుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

    కాగా, బోరుబావిలో పడ్డ సుజిత్‌ను రక్షించేందుకు నాలుగు రోజులు అవిశ్రాంతంగా శ్రమించినా.. ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదు.మొదట 35 అడుగుల లోతులో ఉన్న చిన్నారి.. ఆ తర్వాత 90 అడుగుల లోతులోకి పడిపోవడంతో.. అతన్ని రక్షించడం కష్టంగా మారింది.దీంతో సోమవారం రాత్రి సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారి.. అర్థరాత్రి తర్వాత చనిపోయినట్టు గుర్తించారు. బోరు బావిలో నుంచి కుళ్లిపోయిన వాసన రావడంతో.. వైద్యులు అక్కడికి వచ్చి పరిశీలించారు. సుజిత్ చనిపోయినట్టు అధికారికంగా ధ్రువీకరించారు. సుజిత్ మృతితో.. అతను క్షేమంగా బయటకు రావాలని ప్రార్థించినవాళ్లంతా విషాదంలో మునిగిపోయారు.
    First published:

    Tags: Borewell, Raghava Lawrence, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు