టార్గెట్ రాహుల్... నేడు బీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు

Rahul Gandhi : రాఫెల్ డీల్‌పై అసత్యాలు మాట్లాడిన రాహుల్ గాంధీని బీజేపీ గట్టిగానే టార్గెట్ చేస్తోంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపిచ్చింది.

news18-telugu
Updated: November 16, 2019, 6:39 AM IST
టార్గెట్ రాహుల్... నేడు బీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు
టార్గెట్ రాహుల్... నేడు బీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు
  • Share this:
Rafale and Rahul Gandhi : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చేసిన తప్పు వెంటాడుతోంది. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి వదిలేసినా... బీజేపీ మాత్రం వదలట్లేదు. రాఫెల్ డీల్ విషయంలో రాహుల్ గాంధీ... బీజేపీకి క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తూ... నేడు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపిచ్చింది. ఇందులో భాగంగా... AICC ప్రధాన కార్యాలయం బయట కూడా ఆందోళనలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా... రాఫెల్ డీల్‌లో అవినీతి జరిగిందనీ, ప్రధాని నరేంద్ర మోదీ చౌకీదార్ కాదనీ చోర్ అనీ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఐతే... తాజాగా సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ చేసిన చౌకీదార్ చోర్ వ్యాఖ్యల్ని తప్పుపట్టింది. అలాగే... రాఫెల్ డీల్‌లో కూడా ఎలాంటి అవినీతీ జరగలేదంటూ... ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో... బీజేపీ శ్రేణులు... స్వరాలు పెంచాయి. కాంగ్రెస్, రాహుల్ టార్గెట్‌గా ఆందోళనలకు పిలుపిచ్చాయి.

రాఫెల్ డీల్ వివరాలు బయటపెట్టాలని ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఐతే... ఈ డీల్ దేశ రక్షణకు సంబంధించిన అంశం అనీ, వివరాలు బయటపెట్టడం సరికాదని బీజేపీ వాదించింది. ఈ క్రమంలో విషయం సుప్రీంకోర్టుకు చేరడంతో... ఆ వివరాల్ని తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం సమర్పించిన వివరాల్ని సుప్రీంకోర్టు పరిశీలించి... రాఫెల్ డీల్‌లో ఎలాంటి అవినీతీ జరగలేదని తేల్చింది. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌ను డ్యామేజ్ చెయ్యడానికే కాంగ్రెస్ అసత్య ప్రచారం చేసిందని బీజేపీ ఫైర్ అయ్యింది.

ఎప్పుడైనా ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తాయి. కానీ ఇప్పుడు అధికారపక్షమే ఆందోళనలు చేస్తోంది. మరి రాహుల్ క్షమాపణలు చెబుతారా లేక... ఆందోళనలు ఉద్ధృతం అవుతాయా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. మరోవైపు ఈ అంశంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ట్విటర్‌లో స్పందించారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పూర్తి పారదర్శకంగా జరిగిందని తెలిపారు. భారత రక్షణ వ్యవస్థను మరింత బలంగా చేసే ఉద్దేశంతోనే ఈ డీల్ కుదుర్చుకున్నట్లు వివరించారు.

 

Pics : వెల్వెట్ లెహంగాలో తళుక్కుమన్న ప్రియమణిఇవి కూడా చదవండి :మహారాష్ట్రలో మళ్లీ రాజకీయం... నేడు గవర్నర్‌ను కలవనున్న ఎన్సీపీ, శివసేన

నేటి నుంచీ ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షలు

Health Tips : ఎముకలను దృఢంగా మార్చే టీ... ఎన్నో ప్రయోజనాలు


Health Tips : పీచ్ ఫ్రూట్ తింటున్నారా... మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...


Health Tips : రోజూ 4 బాదం పప్పులు తినండి... మీలో వచ్చే మార్పులు ఇవీ...


పార్టీ టైమ్... హ్యాంగోవర్ అదుపులోకి రావాలంటే...First published: November 16, 2019, 6:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading