హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rafale : రాఫెల్ జెట్స్ అంబాలా ఎయిర్ బేస్‌లోనే ఉంచడం వెనుక ప్లాన్ ఇదే..

Rafale : రాఫెల్ జెట్స్ అంబాలా ఎయిర్ బేస్‌లోనే ఉంచడం వెనుక ప్లాన్ ఇదే..

Rafale Jets | 5 రాఫెల్ జెట్స్‌‌ను రెండు భాగాలుగా విభజించి ఒక స్క్వాడ్రన్‌ను హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో ఉంచుతారు.

Rafale Jets | 5 రాఫెల్ జెట్స్‌‌ను రెండు భాగాలుగా విభజించి ఒక స్క్వాడ్రన్‌ను హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో ఉంచుతారు.

Rafale Jets | 5 రాఫెల్ జెట్స్‌‌ను రెండు భాగాలుగా విభజించి ఒక స్క్వాడ్రన్‌ను హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో ఉంచుతారు.

  ఎన్నాళ్ల నుంచో భారత్ ఎదురుచూస్తున్న రాఫెల్ యుద్ధ విమానం ఇండియాకు చేరింది. ఐదు రాఫెల్ జెట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాయి. భారత మిలటరీ చరిత్రలో కొత్త శకానికి నాంది పలికాయి. 2016లో భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థతో రాఫెల్ జెట్స్ కోసం రూ.59,000 కోట్లతో ఒప్పందం చేసుకున్నప్పుడు.. చైనాతో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద ఇలాంటి యుద్ధం లాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.

  గత ఏడాది అక్టోబర్‌లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ వెళ్లి అక్కడ దసాల్ట్ ఏవియేషన్‌ సంస్థలో రాఫెల్ జెట్ యుద్ధ విమానాలను అందుకున్నప్పుడు కూడా ఎవరూ ఈ పరిస్థితిని అంచనా వేసి ఉండరు. కానీ, లద్దాక్‌లోని గాల్వాన్ వ్యాలీలో చైనా లిబరేషన్ ఆర్మీతో జరిగిన ఘర్షణలో 20 భారత సైనికులు చనిపోవడం, 76 మంది గాయపడడంతో డ్రాగన్ దేశంతో వ్యవహరించే యుద్ధ వ్యూహం మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో అటు పాకిస్తాన్, ఇటు చైనాకు కూడా చెక్ పెట్టేలా భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది.

  భారతదేశం పొరుగున ఉన్న పాకిస్తాన్‌తో 740 కిలోమీటర్ల సరిహద్దు (ఎల్ఓసీ)ని కలిగి ఉంది. చైనాతో 3448 కిలోమీటర్ల సరిహద్దు (ఎల్ఏసీ)ను పంచుకుంటోంది. భారత్ ఈ రెండు పొరుగు దేశాల నుంచి సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు దేశాలకు చెక్ పెట్టడానికి ఇండియా రాఫెల్ జెట్స్‌ను వ్యూహాత్మకంగా వినియోగించనుంది.

  5 రాఫెల్ జెట్స్‌‌ను రెండు భాగాలుగా విభజించి ఒక స్క్వాడ్రన్‌ను హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో ఉంచుతారు. మరో స్క్వాడ్రన్‌ను పశ్చిమ బెంగాల్లోని హసిమారాలో ఉన్న ఎయిర్ బేస్‌లో ఉంచనున్నారు. అంబాలా అనేది ఢిల్లీకి 200 కిలోమీటర్ల ఉత్తరంలో ఉంది. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఆధీనంలో పనిచేస్తుంది. గతంలో పాకిస్తాన్‌లోని బాలాకోట్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసిన మిరాజ్ - 2000 యుద్ధ విమానాలు ఇక్కడి నుంచే వెళ్లాయి. 1999 కార్గిల్ వార్ సమయంలో కూడా ఈ ఎయిర్ బేస్ చాలా కీలకంగా పనిచేసింది.

  అంబాలా ఎయిర్ బేస్‌లో ఆల్రెడీ రెండు స్క్వాడ్రన్ల జాగ్వార్ యుద్ధ విమానాలు ఉన్నాయి. రాఫెల్ కూడా అక్కడ చేరితే మరింత బలం చేకూరుతుంది. జాగ్వార్‌తో పోలిస్తే రాఫెల్ రేంజ్ ఎక్కువ. ఉత్తరం, పశ్చిమం రెండు దిక్కులను కవర్ చేయడానికి అంబాలా ఎయిర్ బేస్ ఎంతో కీలకంగా ఉంటుంది. భౌగోళికంగా చూస్తే కూడా అటు ఎల్ఓసీ, ఎల్ఏసీకి కూడా దాదాపు సమాన దూరంలోనే ఉంటుంది.

  ఇక తూర్పు తీరానికి వస్తే హసిమారా ఎయిర్ బేస్ అనేది రాఫెల్ యుద్ధ విమానాలు ఉంచడానికి సరైన ఎంపిక. హసిమారా ఎయిర్ బేస్ అనేది షిల్లాంగ్ కేంద్రంగా ఉన్న తూర్పు ఎయిర్ కమాండ్ పరిధిలో ఉంటుంది. అటు ఎల్ఏసీకి కూడా దగ్గరలో ఉంటుంది. హసిమారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనేది ఉత్తర బెంగాల్‌లోని సిలిగురి నుంచి ఈశాన్య రాష్ట్రాలను కలిపే 22 కిలోమీటర్ల వెడల్పైన ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటుంది.

  ఈ చిన్న ప్రాంతానికి సరిహద్దుల్లో ఉత్తరాన నేపాల్, దక్షిణాన బంగ్లాదేష్ ఉన్నాయి. సిక్కింలోని నాథూలా పాస్‌ను కూడా ఇది రక్షిస్తూ ఉంటుంది. ఒకవేళ యుద్దం లాంటి పరిస్థితే వస్తే కొండ ప్రాంతాల్లో ఉండే మూడు ప్రధాన మిలటరీ డివిజన్లు గాంగ్ టక్, బిన్నగౌరి, కలింపాంగ్ ‌కు అండగా ఉంటుంది. 2017లో చైనీస్ ఆర్మీ దుందుడుకు చర్యలకు దిగిన డోక్లాం కూడా ఈ హసిమారా ఎయిర్ బేస్‌కు దగ్గరగా ఉంటుంది. రాఫెల్ జెట్స్ రెండో స్క్వాడ్రన్‌ను హసిమారాలో పెట్టాలనుకోవడానికి ఈ డోక్లాం వివాదం కూడా మరో కారణం.

  First published:

  Tags: Rafale Deal, Rafale fighter jet

  ఉత్తమ కథలు