హోమ్ /వార్తలు /జాతీయం /

Rafale Deal: పార్లమెంటులో కాగ్ రిపోర్ట్... రాఫెల్ డీల్‌పై షాకింగ్ విషయాలు

Rafale Deal: పార్లమెంటులో కాగ్ రిపోర్ట్... రాఫెల్ డీల్‌పై షాకింగ్ విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CAG Report on Rafale Deal | 141 పేజీల కాగ్ రిపోర్టులో 32 పేజీల్లో రాఫెల్ డీల్ వివరాలున్నాయి. వైమానిక దళం చేస్తున్న 11 కొనుగోళ్ల ఒప్పందాల వివరాలు ఈ రిపోర్టులో ఉన్నాయి. వాటిలో 5 యూపీఏ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కాగా... ఆరు ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో తీసుకున్నవి.

ఇంకా చదవండి ...

రాఫెల్ డీల్‌ని వివరించే కాగ్ రిపోర్టును రాజ్యసభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్ నుంచీ యూపీఏ హయాంలో నిర్ణయించిన 126 రాఫెల్ యుద్ధ విమానాలు కాకుండా కేంద్రం కేవలం 36 రాఫెల్ యుద్ధ విమానాల్ని మాత్రమే కొనాలనుకుంటున్న ఒప్పందంపై వివాదం కొనసాగుతోంది. ఈ డీల్ ద్వారా మోదీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 141 పేజీల కాగ్ రిపోర్టులో 32 పేజీల్లో రాఫెల్ డీల్ వివరాలున్నాయి. 2012 నుంచీ 2017 వరకూ రాఫెల్ ఒప్పందానికి సంబంధించి ఏం జరిగిందో కాగ్ రిపోర్టులో వివరాలున్నాయి. వైమానిక దళం చేస్తున్న 11 కొనుగోళ్ల ఒప్పందాల వివరాలు ఈ రిపోర్టులో ఉన్నాయి. వాటిలో 5 యూపీఏ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కాగా... ఆరు ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో తీసుకున్నవి.


cag report, parliament, nda, upa, rafale deal, indian air force, congress, bjp, jet fighters, రాఫెల్ డీల్, కాంగ్రెస్, బీజేపీ, పార్లమెంట్
రాజీవ్ మహర్షి, కాగ్


కాగ్ రిపోర్టులో రాఫెల్ డీల్ వివరాలు :

* రాఫెల్ యుద్ధ విమానాలకు UPA ప్రభుత్వం ఏ ధర నిర్ణయించిందో, NDA ప్రభుత్వం కూడా అంతే ధర నిర్ణయించింది. 2007లో యుద్ధ విమానానికి ఏ ధర ఉందో... 2016లోనూ అదే ధర ఉంది.

* యూపీఏ ప్రభుత్వంతో పోల్చితే తాము కుదిర్చిన రాఫెల్ డీల్‌లో యుద్ధ విమానాల ధర 9 శాతం తక్కువ అని బీజేపీ ప్రభుత్వం చెప్పినా... అది నిజం కాదన్న కాగ్... 2.86 శాతం మాత్రమే తక్కువ అని తేల్చింది.

* కొత్త డీల్‌లో భారత్‌ అవసరాలకు తగినట్లు మార్పులు చేసిన 36 యుద్ధ విమానాల కొనుగోలులో 17.08 శాతం మనీ ఆదా అయ్యిందని కాగ్‌ తన రిపోర్టులో తెలిపింది.

* పాత డీల్‌తో పోల్చితే కొత్త డీల్‌లో తొలి 18 యుద్ధ విమానాలు 5 నెలల ముందే భారత్‌కు చేరతాయని వివరించింది.

* రాఫెల్ యుద్ధ విమానం ధర ఎంత అన్న దానిపై మాత్రం రిపోర్టులో వివరాలు లేవు.

* మిగతా 10 కోనుగోళ్ల ఒప్పందాల ధరల వివరాలు కూడా బయటపెట్టలేదు.


cag report, parliament, nda, upa, rafale deal, indian air force, congress, bjp, jet fighters, రాఫెల్ డీల్, కాంగ్రెస్, బీజేపీ, పార్లమెంట్
రాహుల్ గాంధీ (File)


కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టే ముడ్రోజుల ముందు... దాన్ని రూపొందించే రాజీవ్ మహర్షిపై కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. NDA ప్రభుత్వ హయాంలో రాఫెల్ డీల్ కుదిరే సమయంలో... రాజీవ్ మహర్షి... ఫైనాన్స్ సెక్రెటరీగా ఉన్నారనీ, అందువల్ల ఈ రిపోర్టుకి విలువ ఉండదని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.


కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం... స్వతంత్ర సంస్థ అయిన కాగ్‌ నిబద్ధతను సవాలు చేయడం సరికాదంది. తప్పుడు ఆరోపణలు చెయ్యవద్దని కోరింది.


 


Video : ఢిల్లీలో అగ్నిప్రమాదం... కాలి బూడిదైన 250 గుడిసెలు

First published:

Tags: Bjp, Congress, Parliament, Parliament Winter session, Rafale Deal

ఉత్తమ కథలు