ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమా ఎప్రిల్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేస్తుంది. విడుదలైన మూడు వారాలకే ఈ సినిమాను డిజిటల్‌లో విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పైగా థియేటర్స్‌లో ఈ సినిమాను దారుణంగా రిజెక్ట్ చేసారు ప్రేక్షకులు. వసూళ్లు కూడా ఊహించని విధంగా పడిపోయాయి. నిజానికి తొలిరోజు నుంచే ఈ చిత్రానికి ఊహించిన రెస్పాన్స్ రాలేదు. మూడు రోజుల తర్వాత మరింత దారుణంగా పడిపోయాయి వసూళ్లు. ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద సినిమాలలో అత్యంత దారుణంగా పడిపోయిన వసూళ్లు ఇవే. భీమ్లా నాయక్ కంటే తక్కువగా వచ్చాయి ఈ చిత్రానికి కలెక్షన్స్. పాన్ ఇండియన్ అయినా కూడా అన్ని చోట్లా డిజాస్టర్ అయిపోయింది రాధే శ్యామ్. లక్ష్యానికి 120 కోట్ల దూరంలో ఆగిపోయింది ఈ చిత్రం. ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చూడటానికి ప్రేక్షకులు అస్సలు ఇష్టపడలేదని ఈ సినిమా వసూళ్లతో అర్థమవుతుంది. ఒక్కసారి ఏరియా వైజ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి..
నైజాం: 24.78 కోట్లు
సీడెడ్: 7.46 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.88 కోట్లు
ఈస్ట్: 4.34 కోట్లు
వెస్ట్: 3.32 కోట్లు
గుంటూరు: 4.49 కోట్లు
కృష్ణా: 2.70 కోట్లు
నెల్లూరు: 2.14 కోట్లు
ఏపీ, తెలంగాణ క్లోజింగ్ కలెక్షన్స్: 54.11 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 7.65 కోట్లు
హిందీ: 10.50 కోట్లు
ఓవర్సీస్: 12.50 కోట్లు
క్లోజింగ్ వరల్డ్ వైడ్ టోటల్: 84.70 కోట్లు షేర్
ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 202 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే 106 కోట్లు వస్తే కానీ సేఫ్ అవ్వదు. మరోవైపు హిందీలో 52.59 కోట్లకు అమ్మారు. కానీ లక్ష్యానికి దాదాపు 120 కోట్ల దూరంలో ఆగిపోయి అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది రాధే శ్యామ్. ప్రభాస్ కెరీర్‌లో కూడా ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్. సాహోకు నెగిటివ్ టాక్ వచ్చినా 217 కోట్ల షేర్ వసూలు చేసింది. కానీ ఇది మాత్రం దారుణంగా నిరాశ పరిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.