RAAH GROUP FOUNDATION CHAIRMAN NARESH SELPAR ANNOUCES RS 1 LAKH REWARD TO POLICE WHO INVOLVED IN ENCOUNTER BS
దిశ నిందితుల ఎన్కౌంటర్.. ఒక్కో పోలీస్‌కు రూ.లక్ష రివార్డు..
రాహ్ గ్రూప్ చైర్మన్ నరేశ్ సెల్పార్, సజ్జనార్
దిశ నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొన్న ఒక్కో పోలీస్‌కు రూ.లక్ష రివార్డు ప్రకటించారు ఓ వ్యాపారవేత్త. హరియాణాకు చెందిన రాహ్ గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ నరేశ్ సెల్పార్ తెలంగాణ పోలీసులను అభినందిస్తూనే, రివార్డు గురించి ప్రకటన చేశారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొన్న ఒక్కో పోలీస్‌కు రూ.లక్ష రివార్డు ప్రకటించారు ఓ వ్యాపారవేత్త. హరియాణాకు చెందిన రాహ్ గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ నరేశ్ సెల్పార్ తెలంగాణ పోలీసులను అభినందిస్తూనే, రివార్డు గురించి ప్రకటన చేశారు. రాహ్ గ్రూప్ ప్రకటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, దిశ నిందితులను ఈ రోజు ఉదయం ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. సీన్ రీకన్స్ట్రక్షన్ సందర్భంగా నిందితులను ఘటనాస్థలికి తీసుకెళ్లగా అక్కడ పోలీసులపై నిందితులు దాడికి దిగారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరపగా.. వాళ్లు మృతి చెందారు. నలుగురు నిందితులు ఎన్కౌంటర్లోనే చనిపోయారు.
కాగా, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల నుంచి పోలీసులను అభినందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్లు, పోస్టులు జోరందుకున్నాయి. సినీ నటులు కూడా తెలంగాణ పోలీస్ సెల్యూట్ అంటూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.