Home /News /national /

QUIT INDIA MOVEMENT 78TH ANNIVERSARY 5 QUOTES TO REMEMBER FROM MAHATMA GANDHI SPEECH

క్విట్ ఇండియా ఉద్యమానికి 78 ఏళ్లు...దేశాన్ని జాగృతం చేసిన జాతిపిత నినాదాలు ఇవే

క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా చరకాలో నూలు వడుకుతున్న మహాత్మాగాంధీ.

క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా చరకాలో నూలు వడుకుతున్న మహాత్మాగాంధీ.

Quit India Movement 78th Anniversary | దేశ స్వాతంత్రం కోసం చావో రేవో తేల్చుకుందామంటూ క్విట్ ఇండియా ఉద్యమంలో జాతిపిత మహాత్మగాంధీ ఇచ్చిన పిలుపు సమర నినాదమయ్యింది. యావత్ దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి...స్వేచ్ఛా వాయువుల సాధన కోసం కథం తొక్కించింది.

ఇంకా చదవండి ...
    Quit India Movement 78th Anniversary: తెల్ల దొరల పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమానికి నేటితో 78 ఏళ్లు. 1942 ఆగస్టు 8న మమాత్మాగాంధీ ఉక్కు సంకల్పంతో చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర పోరాటంలో కీలక ఘట్టంగా మిగిలిపోయింది. స్వేచ్ఛా వాయువుల కోసం చావో రేవో(డూ ఆర్ డై) తేల్చుకుందామంటూ ఆయన ఇచ్చిన పిలుపు సమర నినాదమయ్యింది. ఈ నినాదమే యావత్ జాతి ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా కథంతొక్కించింది. క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత భారతీయుల్లో పెల్లుబుకిన స్వాతంత్రకాంక్షను గుర్తించిన బ్రిటీష్ పాలకులు...దేశానికి స్వాతంత్రం ఇవ్వక తప్పలేదు.

    Quit India Movement 78th Anniversary, mahatma gandhi quotes, mahatma gandhi message, quit india movement importance, క్విట్ ఇండియా ఉద్యమం, మహాత్మగాంధీ నినాదాలు, మహాత్మాగాంధీ సందేశాలు, మహాత్మాగాంధీ ప్రసంగం
    క్విట్ ఇండియా ఉద్యమంలో మహాత్మాగాంధీ వెంట కథం తొక్కిన జనం


    Quit India Movement 78th Anniversary, mahatma gandhi quotes, mahatma gandhi message, quit india movement importance, క్విట్ ఇండియా ఉద్యమం, మహాత్మగాంధీ నినాదాలు, మహాత్మాగాంధీ సందేశాలు, మహాత్మాగాంధీ ప్రసంగం
    క్విట్ ఇండియా ఉద్యమంలో డూ అర్ డై అంటూ పిలుపునిచ్చిన మమాత్మాగాంధీ


    తమ పోరాటం అధికారం కోసం కాదని...దేశ స్వాతంత్రం కోసం అహింసాయుత పోరాటం చేస్తున్నట్లు ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదాన్ వేదికగా జరిగిన ‘క్విట్ ఇండియా’ సభలో మహాత్మాగాంధీ స్పష్టంచేశారు. ఈ సభలో ఆయన చేసిన మరిన్ని కీలక వ్యాఖ్యలు.

    1.మా పోరాటం అధికారం కోసం కాదు..దేశ స్వాతంత్రం కోసం పూర్తిగా అహింసాయుతంగా చేస్తున్న పోరాటమిది.

    2.అహింసా స్వాతంత్ర పోరాటయోధునికి దేశ స్వాతంత్రం కంటే ఏదీ ముఖ్యంకాదు.

    3.స్వాతంత్ర పోరాట యోధులకు నేనిచ్చే తారక మంత్రం(నినాదం) ఒక్కటే. దీన్ని మీ గుండెలపై లిఖించుకోండి..మీ ప్రతి శ్వాసలోనూ దీన్ని వ్యక్తీకరించండి...ఆ నినాదమే చావో రేవో(డూ ఆర్ డై).

    4.దాస్య శృంఖలాల నుంచి దేశానికి విముక్తి కల్పించడమో...వీరమరణమో తేల్చుకుందాం...ఈ వెట్టిచాకిరిని చూస్తూ ఉండేందుకు బ్రతకాల్సిన అవసరం లేదు.

    5.దేశ స్వాతంత్ర పోరాటంలో ఒకరుగా నిలబడాల్సి వస్తే...యావత్ ప్రపంచాన్నైనా ఎదిరించి నిలుద్దాం. పోరాటంలో భయపడి వెనక్కి తగ్గకండి.

    Quit India Movement 78th Anniversary, mahatma gandhi quotes, mahatma gandhi message, quit india movement importance, క్విట్ ఇండియా ఉద్యమం, మహాత్మగాంధీ నినాదాలు, మహాత్మాగాంధీ సందేశాలు, మహాత్మాగాంధీ ప్రసంగం
    మహాత్మాగాంధీతో జవహర్ లాల్ నెహ్రూ


    క్విట్ ఇండియా ఉద్యమంతో దేశ ప్రజల్లో బలమైన స్వాతంత్ర ఆకాంక్ష బ్రిటీషులకు కూడా తెలిసొచ్చింది. ఫలితంగా ఈ ఉద్యమం తర్వాత మూడేళ్లకు...అంటే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం ఇచ్చారు. అందుకే భారత దేశ స్వాతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని అత్యంత కీలక ఘట్టంగా పేర్కొంటారు.
    Published by:Janardhan V
    First published:

    Tags: Mahatma Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు