Corona Update : ఢిల్లీ ప్రార్థనలపై అంత టెన్షన్ అవసరం లేదు... డాక్టర్ సారిన్ ఏమన్నారంటే...

Corona Lockdown | Coronaupdate : ఢిల్లీలో జరిగిన ప్రార్థనలపై మరీ అంత టెన్షన్ అవసరం లేదంటున్నారు ఓ డాక్టర్. ఇండియాలో వ్యక్తుల నుంచి వ్యక్తులకు కరోనా సోకే ప్రమాదం చాలా తక్కువే అంటున్నారు.

news18-telugu
Updated: March 31, 2020, 1:02 PM IST
Corona Update : ఢిల్లీ ప్రార్థనలపై అంత టెన్షన్ అవసరం లేదు... డాక్టర్ సారిన్ ఏమన్నారంటే...
ఢిల్లీ ప్రార్థనలపై అంత టెన్షన్ అవసరం లేదు... డాక్టర్ సారిన్ ఏమన్నారంటే... (File)
  • Share this:
Corona Lockdown | Coronaupdate : ఢిల్లీ... నిజాముద్దీన్‌లోని... ఓ మసీదు దగ్గర మార్చి 13-15 మధ్య జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న వారందరికీ కరోనా వైరస్ సోకేసిందని చాలామంది అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. అక్కడకు వెళ్లిన వారిలో కొద్ది మందికి కరోనా సోకిన మాట వాస్తవమే. దాన్నే ఎక్కువగా చెబుతూ... పదే పదే ప్రచారం చేస్తున్నారు కొంతమంది. ఇలాంటి భయానక ప్రచారానికి చెక్ పెట్టాలంటున్నారు డాక్టర్లు. ప్రజల్లో లేనిపోని ఆందోళనలు కలిగించడం కూడా తప్పే అవుతుందంటున్నారు. ప్రజల్ని అప్రమత్తం చెయ్యాలే తప్ప... వాస్తవాల్ని పక్కన పెట్టి... ఏదో అయిపోతుందనే భావన కలిగించడం కరెక్ట్ కాదంటున్నారు.

ప్రస్తుతం తబ్లిఘీ జమాత్‌కి చెందిన ప్రధాన మసీదు మర్కజ్ నిజాముద్దీన్‌ను మంగళవారం ఉదయం మూసివేశారు. ఇందులో పాల్గొన్న వారిలో కరోనా వైరస్ సోకిన ఏడుగురు చనిపోయారనే ప్రచారం జరుగుతుండటంతో... ఈ చర్య తీసుకున్నారు. ఆ ఏరియాలోని మొత్తం 200 మందికి కరోనా సోకినట్లుగా భావిస్తున్నారు. దీనిపై వాస్తవాలు చెప్పాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం ఓ టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. దానికి డాక్టర్ ఎస్ కే సారిన్ నేతృత్వం వహిస్తున్నారు. ఐతే... ఆ డాక్టర్ మాత్రం ఢిల్లీలో ఈ వైరస్ స్టేజ్ 3కి రాలేదని అంటున్నారు. అందువల్ల ఇండియాలో ఒకరి నుంచి ఒకరికి ఇది సోకే అవకాశం చాలా తక్కువే అంటున్నారు.

మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిని క్వారంటైన్ చెయ్యడం మంచి నిర్ణయమే అంటున్న డాక్టర్ సారిన్... తద్వారా ఎక్కువ మందికి అది సోకకుండా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఇండియా లాంటి దేశంలో ఒకరికి వైరస్ వస్తే... వారి ద్వారా మరో ఐదు నుంచి ఆరుగురికి ఈ వైరస్ సోకుతోందని తెలిపిన ఆయన... ఐతే... వైరస్ సోకిన వ్యక్తికి ఆరు అడుగుల లోపు ఉన్నవారికే ఈ సోకే ప్రమాదం ఉంటుందన్నారు.

ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కరోనా వైరస్ సోకిన వారు... ఇతరులకు దాన్ని సోకకుండా చెయ్యడానికి... ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తే ఫలితం ఉంటుందన్నారు సారిన్. అందరూ అన్ని జాగ్రత్తలూ పాటిస్తే... కరోనా సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. ఎక్కువ మందికి సోకుతోందని వర్రీ అయ్యే బదులు... అందరూ జాగ్రత్తలు తీసుకుంటే... అసలు సమస్యే ఉండదు కదా అంటున్నారు సారిన్.కరోనా తమకు సోకదనే కాన్ఫిడెన్స్ ప్రజల్లో కలిగేలా చెయ్యాలంటున్న సారిన్... అలా జరగాలంటే... అందరూ ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వాలు చెప్పే సూచనల్ని పాటిస్తే సరిపోతుందంటున్నారు. ఏదో అయిపోతుందని టెన్షన్ పడటం వల్ల బాడీలో పాజిటివ్ ఎనర్జీ డౌన్ అవుతుందే తప్ప... ప్రయోజనం ఏమీ ఉండదంటున్నారు. ప్రభుత్వాలు కూడా... ఇలాంటి విషయాలపై ఎక్కువ ఫీల్ అవ్వకుండా... అనుమానం ఉన్న అందర్నీ టెస్టులు చేసి... క్వారంటైన్ చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలవుతుందని సూచిస్తున్నారు.

ప్రస్తుతానికి ఇండియాలో కమ్యూనిటీ స్ప్రెడ్ (సమూహానికి వైరస్ సోకడం) అన్నది లేదనీ... ఆల్రెడీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబ్టటి... అలా జరిగే అవకాశాలు లేవని అంటున్నారు. ప్రస్తుతం కరోనా పరీక్షలు జరుపుతున్న వారిలో... 86 శాతం మందికి అసలు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరమే కలగట్లేదన్న ఇక ప్రజలు ఎందుకు భయపడాలని అంటున్నారు. ఒకవేళ కరోనా సోకినా... ఆస్పత్రిలో చేరిన నాలుగైదు రోజులకే... అది కంట్రోల్‌లోకి వచ్చేస్తోందనీ, రెండు వారాల తర్వాత వాళ్లు డిశ్చార్జి అవుతున్నారనీ ఆయన చెబుతున్నారు. అందువల్ల ప్రజలు ప్యానిక్ అవ్వడం మాని... తగిన జాగ్రత్తలు తీసుకోవడమే సరైన పరిష్కారం అంటున్నారు సారిన్.
First published: March 31, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading