Home /News /national /

PYTHON RESCUED BATHROOM HOUSE NEW DELHI BN

బాత్‌రూమ్‌లో ఐదడుగుల కొండ చిలువ.. ఏం చేసిందో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బాత్‌రూమ్‌లో దాక్కున్న కొండ చిలువను పట్టుకుని సురక్షితంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే ఆ కొండ చిలువ అనారోగ్యంతో ఉండడంతో ఎన్‌జీఓ ప్రతినిధులు దాన్ని పర్యవేక్షణలో ఉంచారు.

    కొండ చిలువ.. దాని పేరు వింటేనే వెన్నులో వణుకుపుడుతుంది. ఇక నేరుగా దాన్ని చూస్తే.. భయంతో గజగజ వణకాల్సిందే. ఎక్కడో అటవీ ప్రాంతాల్లో కొండ చిలువ ఎక్కువగా కన్పిస్తుంది. అరుదుగా అల్లంత దూరంలో అది కన్పిస్తేనే.. వణికిపోతుంటాం. అయితే ఓ కుటుంబానికి మాత్రం కొండ చిలువ కారణంగా ఊహించని షాక్ తగిలింది. అదేంటి అనుకుంటున్నారా.. అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన కొండ చిలువ కాస్త బాత్‌రూమ్‌లో కన్పించేసరికి వారి ప్రాణాలు పోయినంత పని అయ్యింది. వైల్డ్ లైఫ్ ప్రతినిధులకు సమచారం ఇవ్వడంతో వారి క్షేమంగా దాన్ని పట్టుకెళ్లిపోవడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీలోని ఓక్లహాలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. ఇటీవల కురుస్తున్నభారీ వర్షాలకు ఆ కుటుంబం నివసిస్తున్న ఇంటి బాత్‌రూమ్‌లోకి ఐదడుగుల కొండ చిలువ ఏలానో వచ్చి అక్కడ తిష్ట వేసింది.

    ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులు ఒకరు బాత్‌రూమ్‌లోకి వెళ్లేందుకు తలుపు తీయగానే.. ఐదడుగుల కొండచిలువ వారి కంట పడింది. ఊహించని ఈ పరిణామానికి ఆ కుటుంబం ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. అనంతరం తేరుకున్న కుటుంబ సభ్యులు వెంటనే వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ అనే ఎన్జీవోకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది బాత్‌రూమ్‌లో దాక్కున్న కొండ చిలువను పట్టుకుని సురక్షితంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే ఆ కొండ చిలువ అనారోగ్యంతో ఉండడంతో ఎన్‌జీఓ ప్రతినిధులు దాన్ని పర్యవేక్షణలో ఉంచారు.

    ఇదిలావుంటే.. వర్షాల వల్ల పాములు పొడి ప్రదేశాల్లో ఉండేందుకు ఇష్టపడతాయి. అందులో భాగంగానే పొడి ప్రదేశాలను వెతుక్కుంటూ అనుకోకుండా ఇళ్లలోకి వచ్చి చేరుతాయని ఎస్ఓఎస్ ప్రతినిధి వసీమ్ అక్రమ్ తెలిపారు. ఇదిలావుంటే.. మరో ఘటనలో ఒడిశాలోని బురుఝరి గ్రామంలో భారీ నాగుపాము స్థానికంగా ఉన్న ఓ బావిలో ఇరుక్కుపోయింది. దీన్ని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం చేరవేశారు.

    దీంతో స్నేక్ హెల్ప్ లైన్ టీమ్‌ను ఆ ప్రాంతానికి పంపగా, వారు దాదాపు గంట పాటు శ్రమించి నాగుపామును బయటకు తీశారు. బయటకు తీసిన నాగుపామును చూసి అక్కడి వారంతా షాక్‌కు గురయ్యారు. దాదాపు ఆ పాము 12 నుంచి 15 అడుగుల పొడవు ఉంది. స్నేక్ హెల్ప్ లైన్ సిబ్బంది దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Delhi, Python, Snake

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు