PYTHON RESCUED AFTER SWALLOWING LARGE PREY IN UP NS
Python Rescued: కొండచిలువను కాపాడిన ప్రజలు.. వీడియో వైరల్!
కొండచిలువ
Python Rescued: పైశాచిక ఆనందం కోసం కొందరు మూగజీవాలను చంపేస్తున్న ఈ రోజుల్లో ఓ గ్రామస్తులు కొండచిలువనే కాపాడారు. అధికారులతో కలిసి దానిని అడవిలోకి చేర్చారు.
పైశాచిక ఆనందం కోసం కొందరు మూగజీవాలను హింసించి చంపేస్తున్న ఈ రోజుల్లో ఓ గ్రామస్తులు కొండచిలువనే కాపాడారు. భారీగా ఆహారం తిని కదలలేకపోతున్న దాని పరిస్థితి చూసి ఆందోళన చెందారు. అధికారులకు సమాచారం అందించి దాన్ని తిరిగి అడవిలోకి చేర్చేందుకు సహాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా సీహరి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.
వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని సీహరి గ్రామంలోకి ఓ భారీ కొండచిలువ ప్రవేశించింది. అది ఓ మేకను మింగడంతో దాని కడుపు బాగా ఉబ్బింది. దీంతో అది కదలలేని పరిస్థితికి చేరింది. ఎలాగైనా దానిని రక్షించాలన్న ఆలోచనతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని ఇనుప తీగల సహాయంతో ఆ కొండచిలువను ట్రాక్టర్ లోకి ఎక్కించి అడవిలోకి తీసుకెళ్లి వదలిపెట్టారు. గ్రామంలోని అనేక మంది ఇందుకు సహకరించారు.
ఈ విషయంపై డివిజనల్ ఫారెస్ట్ అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామస్తుల నుంచి సమాచారం అందగానే తమ బృందం గ్రామానికి చేరుకుందన్నారు. ఆ కొండచిలువను కాపాడి సమీప అడవిలో వదిలేశామన్నారు. అది ఒక భారీ మేకను మింగడంతో కదలలేని పరిస్థితికి చేరిందన్నారు. స్థానికులు ఆ కొండచిలువను చూడగానే భయపడ్డారన్నారు. కానీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని తాము వివరించామన్నారు. కొండచిలువ ప్రమాదకరం కాదని, దానికి విషం కూడా ఉండదని ఫారెస్ట్ అధికారి వివరించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.