PURNAGIRI JANSATABDI TRAIN RUNS BACKWARDS DUE TO CATTLE RUN OVER BETWEEN KHATIMA TANAKPUR SECTION IN UTTARAKHAND SK
Video: ట్రైన్ రివర్స్ గేర్.. 35 కి.మీ. వెనక్కి దూసుకెళ్లిన రైలు.. చివరకు ఏం జరిగింది?
వెనక్కి వెళ్తున్న రైలు
పూర్ణగిరి జనశతాబ్ది అనే ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని తనఖ్పూర్కు బయలుదేరింది. మరికొద్ది గంటల్లో తనఖ్పూర్కు రైలు వెళ్తుందనగా... ట్రాక్‌పైకి పశువులు వచ్చాయి.
రైలు రివర్స్‌లో వెళ్లడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. రైల్వే స్టేషన్లో ట్రాక్స్ మారేటప్పుడు ఇంజిన్ వెనక్కి వెళ్లడం చూస్తుంటాం. కానీ ప్రయాణికులు ఉన్నప్పుడు మాత్రం అలా జరగదు. కానీ ఉత్తరాఖండ్‌లో ఓ ఎక్స్‌ప్రెస్ రైలు ఏకంగా రూ.35 కి.మీ. వెనక్కి వెళ్లింది. దాని నిండా ప్రయాణికులున్నారు. రైలు రివర్స్ గేర్‌లో దూసుకెళ్లడంతో ప్రయాణికులు వణికిపోయారు. అసలు అది వెనక్కి ఎందుకు వెళ్లింది? చివరకు ఏమైంది? పూర్ణగిరి జనశతాబ్ది అనే ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని తనఖ్పూర్కు బయలుదేరింది. మరికొద్ది గంటల్లో తనఖ్పూర్కు రైలు వెళ్తుందనగా... ట్రాక్‌పైకి పశువులు వచ్చాయి. పెద్ద సంఖ్యలో పశువులు రావడంతో లోకో పైలట్‌కు ఏం చేయాలో అర్ధం కాలేదు. వెంటనే సడెన్ బ్రేక్స్ వేశాడు.
సడెన్ బ్రేక్ వేసిన తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ.. ఆగి పోవాల్సిన ఆ రైలు ఒక్కసారిగా వెనక్కి వెళ్లడం మొదటుపెట్టింది. లోకో పైలట్స్ ఎంత ప్రయత్నించినా ఆగలేదు. రైలుపై లోకో పైలట్లు నియంత్రణ కోల్పోయారు. అలా 35 కి.మీ. వెనక్కి వెళ్లి ఖాతిమా దగ్గర రైలు ఆగిపోయింది. రైలు వేగంగా వెనక్కి దూసుకెళ్తుండగా కొందరు స్థానికులు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా మారాయి.
#WATCH | Purnagiri Jansatabdi train runs backwards due to cattle run over b/w Khatima-Tanakpur section in Uttarakhand. Incident happened earlier today.
There was no derailment & passengers were transported to Tanakpur safely. Loco Pilot & Guard suspended: North Eastern Railway pic.twitter.com/808nBxgxsa
ఖాతిమా దగ్గర రైలు నిలిచిపోయిన తర్వాత ప్రయాణికులను కిందికి దించేశారు. వారిని బస్సుల ద్వారా తనక్‌పూర్‌కు పంపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రైలు లోకోపైలట్, గార్డ్లను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అసలు రైలు ఎలా వెనక్కి వెళ్లిందో తెలుసుకునేందుకు సాంకేతిక బృందం పిలిభిత్ నుంచి తనక్‌పూర్ వెళ్లింది. ఐతే 35 కి.మీ పాటు రైలు వేగంగా వెనక్కి వెళ్లినా.. ఎక్కడా పట్టాలు తప్పకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.