• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • PUNJAB YOUTH STOPPED BOLLYWOOD ACTOR AJAY DEVGAN CAR ON MUMBAI ROAD SAYS WHY HE SILENT ON FARMERS PROTEST VIDEO BECOME VIRAL IN INTERNET AK

RRR హీరో కారును అడ్డుకున్న యువకుడు.. స్టార్‌పై ఆగ్రహం.. వీడియో వైరల్

RRR హీరో కారును అడ్డుకున్న యువకుడు.. స్టార్‌పై ఆగ్రహం.. వీడియో వైరల్

అజయ్ దేవగన్, రణ్ దీప్ సింగ్ (ఫైల్ ఫోటో)

RRR Star Ajay Devgan: ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్‌కు ఊహించని అనుభవం ఎదురైంది.

 • Share this:
  కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు తాము ఇంటికి వెళ్లబోమని.. తమ ఆందోళన విరమించబోమని రైతులు, పలు రైతు సంఘాలు స్పష్టం చేశాయి. తాజాగా రైతుల ఆందోళనపై స్పందించలేదనే ఆగ్రహంతో.. పంజాబ్‌కు చెందిన రాజ్ దీప్ సింగ్ అనే యువకుడు ముంబైలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కారును అడ్డుకున్నాడు. ముంబై రోడ్డుపై అజయ్ దేవగన్ కారు రావడాన్ని గమనించిన రాజ్ దీప్ సింగ్.. ఆయనను చూస్తూ గట్టిగా మాట్లాడాడు. మీరు మా ఆందోళన గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మీరు రైతుల కష్టం తెలియడం లేదా ? అని అన్నారు. మీరు రోజూ తిండి పెట్టే రైతు గురించి ఎందుకు మాట్లాడం లేదని అన్నారు.

  అయితే ఘటన గురించి సమాచారం అందుకున్న డిందోషి పోలీసులు.. రాజ్ దీప్ సింగ్‌ను అరెస్ట్ చేసి అజయ్ దేవగన్ కారును అక్కడి నుంచి పంపించేశారు. రాజ్ దీప్ సింగ్‌‌పై సెక్షన్ 504, 506, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. రేపు అతడికి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక రాజ్ దీప్ సింగ్‌ తన కారును అడ్డుకుని మాట్లాడినంత సేపు కారులో ఉండిపోయారు అజయ్ దేవగన్. మధ్య మధ్యలో అతడికి నమస్కారం చేశారు.  మరోవైపు రైతు ఆందోళనలపై గత నెల 3వ తేదీన అజయ్ దేవగన్ పరోక్షంగా స్పందించారు. దేశం, దేశ రాజకీయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన సూచించారు. అంతా ఐక్యంగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం అజయ్ దేవగన్ బాలీవుడ్‌లోని పలు సినిమాలతో పాటు ప్యాన్ ఇండియా వైడ్‌గా తెరకెక్కుతున్న రాజమౌళి నయా మూవీ ఆర్ఆర్ఆర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: