Home /News /national /

PUNJAB UTTAR PRADESH UTTARAKHAND MANIPUR GOA ASSEMBLY ELECTION 2022 RESULTS COUNTING WILL BE START TOMORROW AK

Assembly Election 2022 LIVE Results: మరికొద్ది గంటల్లోనే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. అందరి చూపు ఆ రాష్ట్రాల మీదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Five states assembly election 2022 Results: యూపీలో బీజేపీకి మళ్లీ అధికారం దక్కడం ఖాయమనే చర్చ జరుగుతున్నప్పటికీ.. వాస్తవ ఫలితాలు అందుకు భిన్నంగా ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇబ్బందులు తగ్గవనే చర్చ సాగుతోంది.

    హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లోనే వెల్లడి కానున్నాయి. ఉత్తరప్రదేశ్, (Uttar Pradesh) పంజాబ్ (Punjab), ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఏ రాష్ట్రంలో ఎవరిది ఆధిపత్యం అనే అంశంపై మధ్యాహ్నం సమయానికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందరి కళ్లు దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ మీదే ఉన్నప్పటికీ.. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ? ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు ? ఎవరికి షాక్ ఇవ్వబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

    ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి మళ్లీ అధికారం ఖాయమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) స్పష్టం చేసినప్పటికీ.. వాస్తవ ఫలితాలు అందుకు తగ్గట్టుగానే ఉంటాయా ? లేక ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా వాస్తవ ఫలితాలు ఉంటాయా ? అనే ఆసక్తి కూడా నెలకొంది. గతంలో పలుసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారైన సందర్భాలు అనేకం ఉండటంతో.. మరోసారి అలాంటి సీన్ రిపీట్ అవుతుందా ? అనే చర్చ కూడా సాగుతోంది.

    ఎగ్జిట్ పోల్స్‌లో పలు రాష్ట్రాల్లో ఫలితాలు ఏదో ఒక పార్టీ లేదా కూటమికి మెజార్టీ వస్తుందని అంచనా వేయగా.. ఉత్తరాఖండ్, గోవా వంటి రాష్ట్రాల్లో మాత్రం హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. మరోవైపు పంజాబ్‌లో కొత్తగా ఆప్ అధికారంలోకి వస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో.. ఆ పార్టీ ఏ స్థాయిలో పంజాబ్‌లో హవా చూపిస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.

    Election Results 2022: కొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు.. ఓట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

    Exits Polls: ఉత్తరప్రదేశ్‌ మళ్లీ బీజేపీదే.. వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. మిగతా నాలుగు రాష్ట్రాల్లో వారిదే అధికారం

    యూపీలో బీజేపీకి మళ్లీ అధికారం దక్కడం ఖాయమనే చర్చ జరుగుతున్నప్పటికీ.. వాస్తవ ఫలితాలు అందుకు భిన్నంగా ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇబ్బందులు తగ్గవనే చర్చ సాగుతోంది. మరోవైపు యూపీలో బీజేపీ మరోసారి స్పష్టమైన మెజార్టీ సాధించి అధికారం నిలబెట్టుకుంటే.. జాతీయస్థాయిలో ఆ పార్టీ మరింత దూకుడుగా ముందుకు సాగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Assembly Election 2022, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు