హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

‘సీఎం భగవంత్ గతంలో చెప్పిన దానికి, ఇప్పుడు చేస్తున్న వాటికి పొంతన లేదు..’.. ట్విటర్ లో ఏకీపారేస్తున్న కాంగ్రెస్ నేతలు..

‘సీఎం భగవంత్ గతంలో చెప్పిన దానికి, ఇప్పుడు చేస్తున్న వాటికి పొంతన లేదు..’.. ట్విటర్ లో ఏకీపారేస్తున్న కాంగ్రెస్ నేతలు..

సీఎం భగవంత్ మాన్ (ఫైల్)

సీఎం భగవంత్ మాన్ (ఫైల్)

Punjab: సీఎం భగవంత్ మాన్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనను కాంగ్రెస్ నేేతలు ట్విటర్ వేదికగా ఏకీపారేస్తున్నారు. దీంతో పంజాబ్ రాజకీయాలు మరోసారి హట్ టాపిక్ గా మారాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Punjab, India

పంజాబ్ (Punjab) రాష్ట్రం మరోసారి వార్తలలో నిలిచింది. ఈసారి సీఎం భగవంత్ మాన్ ఉపయోగించే వాహన శ్రేణి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దీనిపై కాంగ్రెస్ నేత పర్తాన్ సింగ్ బజ్బా సమాచారహక్కు కింద అప్లికేషన్ ను దాఖలు చేశారు. దీనిలో సీఎం భగవంత్ మాన్ (Bhagwant mann) తన కాన్వాయ్ లో 42 వాహనాలు ఉపయోగిస్తున్నట్లు బయటపడింది. అయితే.. దీనిపై కాంగ్రెస్ నేతలు ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. గతంలో పంజాబ్ కు సీఎంగా పనిచేసిన చరణ్ జిత్ సింగ్ ఛన్నీ, అమరీందర్ సింగ్, ప్రకాశ్ సింగ్ బాదల్ వీరి కంటే ఎక్కువ కార్లను సీఎం భగవంత్ మాన్ ఉపయోగిస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.

బాదల్ సీఎంగా ఉన్న కాలంలో... 2007-17 ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్ లో 33 వాహనాలు ఉన్నాయి. ఆతర్వాత.. కెప్టెన్ అమరీందర్ ఎస్ సీఎం అయినప్పుడు వాహనాల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదు. కానీ సీఎం మాన్ మాత్రం 42 కార్లు ఉపయోగిస్తున్నారని ఆర్టీఐ సమాచారంతో బయటపడిందని అని రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న బజ్వా ట్వీట్ చేశారు.

రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ట్విట్టర్‌లో అందించిన ఆర్టీఐ సమాధానాన్ని బజ్వా పంచుకుంటూ, "గతంలో మిస్టర్ మాన్ 'రాజులు, మహారాజులు' ఇన్ని వాహనాల కాన్వాయ్‌తో ఏమి చేస్తారని ప్రశ్నించేవారు..? ఇప్పుడు సీఎం మాన్ స్వయంగా ఏమి చేస్తున్నారో స్పష్టం చేస్తారా? 42 వాహనాల కాన్వాయ్?" అంటూ చురకలంటించారు. ప్రకాష్ సింగ్ బాదల్ ముఖ్యమంత్రిగా ఉన్న మొదటి, రెండవ పదవీకాలంలో రాష్ట్ర రవాణా సంస్థ ఆయనకు అందించిన కార్ల సంఖ్య 33 అని బజ్వా పేర్కొన్నారు.

అదేవిధంగా, అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నందున సెప్టెంబర్ 19, 2021లో పదవీకాలం ముగిసే వరకు కాన్వాయ్ లో 33 వాహనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం అందించిన RTI ప్రత్యుత్తరాన్ని ఉటంకిస్తూ, సెప్టెంబర్ 20, 2021 నుండి మార్చి 16, 2022 వరకు, చరణ్‌జిత్ సింగ్ చన్నీ సీఎంగా తన కాన్వాయ్‌లో 39 కార్లు ఉన్నాయని, మరో ఆరు వాహనాలు ఉన్నాయని చెప్పారు.

ఇంత పెద్ద వాహనాల కాన్వాయ్ ఏ ప్రయోజనం కోసం ఉపయోగపడుతుందో పంజాబ్ పౌరులకు చెబుతారా అని కాంగ్రెస్ నాయకుడు భగవంత్ మాన్‌ను ప్రశ్నించారు. “భగవంత్ మాన్ సీఎం కావడానికి ముందు బోధించేవాటికి, సీఎం అయిన తర్వాత ఆచరించే వాటికి మధ్య చాలా వైరుధ్యం ఉందని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, భగవంత్ మాన్ గతంలో.. సంగ్రూర్ ఎంపీగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలపై అధికార పార్టీపై విరుచుకుపడ్డారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bhagwant Mann, Congress, Punjab

ఉత్తమ కథలు