• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • PUNJAB POLICE NAB 2 TO BUST DRONE MODULE ENGAGED IN CROSS BORDER SMUGGLING OF NARCOTICS WEAPONS BA GH

India - Pakistan: పాకిస్తాన్ మత్తు ప్లాన్ చిత్తు చేసిన భారత్, పక్కా ప్లాన్‌తో షాక్

India - Pakistan: పాకిస్తాన్ మత్తు ప్లాన్ చిత్తు చేసిన భారత్, పక్కా ప్లాన్‌తో షాక్

ఫ్రతీకాత్మక చిత్రం

డ్రోన్ల సాయంతో హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలను పంజాబ్ సరిహద్దుల్లోని గ్రామాల్లోకి అక్రమంగా పాకిస్థాన్ తరలిస్తోంది. గురుదాస్‌పూర్ గ్రామంలోకి డ్రోన్ సాయంతో మాదక ద్రవ్యాలను పంపినట్టు బీఎస్ఎఫ్ నిఘా విభాగం గుర్తించింది.

  • Share this:
మనదేశంలోకి అక్రమంగా మత్తుపదార్థాలను స్మగ్లింగ్ చేసేందుకు పాకిస్థాన్ ఎప్పటినుంచో డ్రోన్ల ను ఉపయోగిస్తోంది. తాజాగా అలాంటి ఓ ప్రయత్నాన్ని నార్కోటిక్స్ శాఖ పసిగట్టింది. మరోవైపు దీనికి ఖలిస్థాన్ లింక్ కూడా ఉండటంతో మరింత అప్రమత్తమైంది. క్రాస్-బార్డర్ స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేసిన పంజాబ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. డ్రోన్ల ద్వారా వీరు నిషిద్ధ మత్తు పదార్థాలను చేరవేస్తున్నారు. ఖలిస్థాన్ ఆపరేటివ్స్ పాత్ర కూడా ఇందులో ఉండగా ఇదో పెద్ద అంతర్జాతీయ నెట్వర్క్ తో పనిచేసే వ్యవహారంగా తేల్చారు. అరెస్టు అయిన వారిని లక్భీర్ సింగ్ (Lakhbir Singh)అలియాస్ లఖా, బచ్చిర్ సింగ్ గా గుర్తించినట్టు అమృత్ సర్ రూరల్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అమృత్ సర్ జైలులో నలుగురు డ్రగ్ స్మగ్లర్లుండగా, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఈ స్మగ్లింగ్ వెనుకున్న శక్తులను గుర్తించవచ్చని పోలీసులు వివరించారు.

డీజీపీ దినకర్ గుప్తా వెల్లడించిన వివరాల ప్రకారం.. సపోర్టర్ స్టాండ్ తోపాటు ఉన్న ఒక క్వాడ్ కాప్టర్ డ్రోన్, ఒక SkyDroid T10 2.4GHz 10 CH FHSS ట్రాన్స్ మీటర్, దీంతోపాటు మిని రిసీవర్, కెమెరా సపోర్ట్ ఉన్న మొత్తం పరికరాలను సీజ్ చేశారు. 32 బోర్ రివాల్వర్, HR-35M-3709 నంబర్ స్కార్పియో కారు, వీటితో పాటు లైవ్ క్యాట్రిడ్జెస్, డ్రగ్స్ ను సీజ్ చేశారు.

పంజాబ్ పోలీసులు పట్టుకున్న డ్రోన్


అంతర్జాతీయ నెట్ వర్క్
ముఖ్య అనుమానితుడిగా లక్భీర్ సింగ్ ను పేర్కొన్న డీజీపీ, లక్భీర్ ను అమృత్ సర్ లోని గురుద్వారా తహ్లా సాహిబ్ వద్ద అరెస్టు చేశారు. కాగా 4 నెలల క్రితం ఢిల్లీలో తాను క్వాడ్ కాప్టర్ డ్రోన్‌ను సేకరించినట్టు ప్రస్తుతం తన సహచరుడి వద్ద అమృత్ సర్ లో ఈ డ్రోన్ ఉన్నట్టు పోలీసులకు లక్భీర్ వెల్లడించాడు. ప్రస్తుతం అమృత్ సర్ జైల్లోని నలుగురు అనుమానితులతో లక్భీర్ తరచూ సంప్రదింపులు జరిపాడని తేలింది. కాగా లక్భీర్ ప్రధాన అనుచరుడు, డ్రగ్ స్మగ్లర్ అయిన సుర్జీత్ మసిని జైల్లో తనిఖీ చేయగా, అతని వద్ద టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ దొరికినట్టు జైలు అధికారులు వెల్లడించారు. కాగా పోలీసులు ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో లక్భీర్ ఇందుకు అంతర్జాతీయ నెట్ వర్క్ ను స్థాపించినట్టు ఆధారాలు దొరికాయి. విదేశీ స్మగ్లర్లతో ఇతనికి స్మగ్లింగ్ నెట్వర్క్ ఉండగా, చిష్టి వంటి పాకిస్థాన్ కు చెందిన పేరుమోసిన స్మగ్లర్లతో లక్భీర్ కాంటాక్ట్ లో ఉన్నాడు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్థాన్ ఆపరేటివ్స్ తో చిష్టి టచ్ లో ఉన్నాడు. గతంలో జరిగిన ఇలాంటి క్రాస్ బార్డర్ స్మగ్లింగ్ లోనూ ఇతని పాత్ర ఉంది. స్మగ్లింగ్ చేసేందుకే 4 లక్షలు వెచ్చించి అత్యాధునిక డ్రోన్లను లక్భీర్ కొనుగోలు చేసినట్టు తేలింది.

సరిహద్దు గ్రామాలే టార్గెట్
డ్రోన్ల సాయంతో హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలను పంజాబ్ సరిహద్దుల్లోని గ్రామాల్లోకి అక్రమంగా పాకిస్థాన్ తరలిస్తోంది. గురుదాస్‌పూర్ గ్రామంలోకి డ్రోన్ సాయంతో మాదక ద్రవ్యాలను పంపినట్టు బీఎస్ఎఫ్ నిఘా విభాగం గుర్తించింది. సరిహద్దు‌లోని షహారన్, చండీగఢ్ ఔట్‌‌పోస్ట్ సమీపంలో డ్రోన్‌ ను గుర్తించారు. ఇటీవల డ్రగ్ ముఠాలు సట్లెజ్, రావీ నదీ ప్రవాహ మార్గాల గుండా స్కూబా డ్రైవర్ల సాయంతో మాదకద్రవ్యాలను దేశంలోకి అక్రమంగా తరలించినట్టు గతంలో గుర్తించారు. పంజాబ్‌లోని 553 కిలోమీటర్ల భారత్- పాక్ సరిహద్దులో బీఎస్ఎఫ్ దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం అబోహర్, ఫిరోజ్‌పూర్, అమృత్‌సర్, గురుదాస్‌పూర్ జిల్లాలో డ్రగ్స్ ను పాక్ ముఠాలు అక్రమంగా రవాణా చేస్తున్నాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:

అగ్ర కథనాలు