హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Navjot Singh Sidhu: ఢిల్లీ సీఎంకు నవజ్యోత్ సింగ్​ సిద్దూ అదిరిపోయే షాక్​​.. కేజ్రీవాల్ ఇంటి ముందు కొచ్చి..

Navjot Singh Sidhu: ఢిల్లీ సీఎంకు నవజ్యోత్ సింగ్​ సిద్దూ అదిరిపోయే షాక్​​.. కేజ్రీవాల్ ఇంటి ముందు కొచ్చి..

కేజ్రీవాల్​ ఇంటి ముందు సిద్ధూ (Photo: ANI/Twitter)

కేజ్రీవాల్​ ఇంటి ముందు సిద్ధూ (Photo: ANI/Twitter)

పంజాబ్‌లో తాము అధికారంలోని వస్తే కాంట్రాక్టు టీచర్ల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఇక పంజాబ్​లో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్​. ఆ పార్టీకి పీసీసీ చీఫ్​గా ఉన్నది నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) . ఏకంగా కేజ్రీవాల్​ ఇలాకాలో అడుగుపెట్టారు. ఆప్​ సర్కారుకు దిమ్మతిరిగే షాక్​ ఇచ్చారు.

ఇంకా చదవండి ...

అరవింద్​ కేజ్రీవాల్ (Aravind Kejriwal). సమాజ సేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి అనతికాలంలోనే అధికారాన్ని దక్కించుకున్న వ్యక్తి. ఢిల్లీలో అప్పటివరకు ఉన్న అధికార కాంగ్రెస్​.. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీని మట్టికరిపించి అధికారాన్ని చేజిక్కించుకున్నారు.  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ (Delhi CM Aravind Kejriwal) పార్టీని విస్తరించే పనిలో పడ్డారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో పోటీలో తన పార్టీ అభ్యర్థులను నిలుపుతున్నారు కేజ్రీవాల్​. ఇదే క్రమంలో పంజాబ్​లోనూ  (Punjab)అధికారమే లక్ష్యంగా దూసుకెళుతున్నారు ఢిల్లీ సీఎం. పంజాబ్​లో టీచర్లు (Punjab teachers) తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గతంలో ధర్నాలు చేస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఓ టీచర్​ ఏకంగా వాటర్​ ట్యాంకు ఎక్కాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తితో అరవింద్​ కేజ్రీవాల్​ మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్​ అయ్యాయి.

పంజాబ్​లో కేజ్రీవాల్​..

కేజ్రీవాల్‌ అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. పంజాబ్‌లో తాము అధికారంలోని వస్తే కాంట్రాక్టు టీచర్ల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. ఇక పంజాబ్​లో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ (congress)​. ఆ పార్టీకి పీసీసీ చీఫ్ (PCC chief)​గా ఉన్నది నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) . ఇక ఆయన ఊరుకుంటారా? నా పుట్టలో వేలు పెడితే ఊరుకుంటానా.. అన్నట్లు.. ఏకంగా కేజ్రీవాల్​ ఇలాకాలో అడుగుపెట్టారు. ఆప్​ సర్కారుకు దిమ్మతిరిగే షాక్​ ఇచ్చారు.

కేజ్రీవాల్ ఇంటి ముందు సిద్ధూ..

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ అధికార పార్టీ కాంగ్రెస్‌పై పలు విమర్శలు  చేశారు. అయితే.. కేజ్రీవాల్ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు.. కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వినూత్నంగా  రంగంలోకి దిగారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటి ఎదుట నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ (Navjot Singh Sidhu) ఆదివారం నిరసన చేశారు.

తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ (Jobs Permanent‌) చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఎం ఇంటి వద్ద ధర్నా (Protest) చేస్తున్న ప్రభుత్వ గెస్ట్‌ టీచర్ల ( Government Guest‌ Teachers)కు ఆయన సంఘీభావం తెలిపారు. వారి నిరసనలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా పాల్గొని నినాదాలు చేశారు. ఉపాధ్యాయులతో కలిసి ఆప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా (Against the AAP government) నినాదాలు చేయడంతోపాటు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిద్ధూ అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.

కాంట్రాక్ట్ మోడల్ అంటూ..

ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ కాంట్రాక్ట్ మోడల్ అంటూ సిద్ధూ పేర్కొన్నారు. ఆప్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీ (delhi)లో గత ఐదేళ్లలో నిరుద్యోగం దాదాపు 5 రెట్లు పెరిగిందంటూ ట్విట్ చేశారు. పంజాబ్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆప్‌ (AAp) చేస్తున్న విమర్శలను.. సిద్ధూ ఈ విధంగా తిప్పికొట్టారు. ముందు ఇక్కడ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సిద్ధూ చురకలు అంటించారు.

196 స్కూళ్లలోనే ప్రధానోపాధ్యాయులు

ఢిల్లీలో 1031 పాఠశాలలు ఉంటే, కేవలం 196 స్కూళ్లలోనే ప్రధానోపాధ్యాయులు ఉన్నారని.. 45 శాతం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగానే ఉన్నాయని పేర్కొన్నారు. 22వేల మంది గెస్ట్‌ టీచర్లతోనే ఢిల్లీ ప్రభుత్వం నెట్టుకొస్తుందంటూ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. గత ఏడేళ్లుగా తమ హామీలను నెరవేర్చని అరవింద్‌ కేజ్రీవాల్‌.. పంజాబ్‌లో హామీలు గుప్పిస్తున్నారంటూ గెస్ట్ టీచర్ల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది.

First published:

Tags: Arvind Kejriwal, Assembly Election 2022, Delhi, Navjot Singh Sidhu, Private teachers, Punjab, Teaching

ఉత్తమ కథలు