హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మరో ఘటన.. డ్రగ్స్ తో అడిక్ట్ అయిన యువకుడు.. నడి రోడ్డుమీద..

మరో ఘటన.. డ్రగ్స్ తో అడిక్ట్ అయిన యువకుడు.. నడి రోడ్డుమీద..

మత్తులో తూలుతున్న స్థానికులు

మత్తులో తూలుతున్న స్థానికులు

Punjab: యువకుడు డ్రగ్స్ తీసుకున్నాడు. రోడ్డుపైన తూలుతు వెళ్తున్నాడు. కనీసం ఒక అడుగు తీసి మరోక అడుగు వేయలేకపోతున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Punjab, India

కొన్నిరోజులుగా పంజాబ్ లోని (Punjab)  వరుస ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఇప్పటికే పంజాబ్ రాజకీయాలు హట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. సీఎం భగవంత్ మాన్ జర్మనీలో తాగి ఉండటం వలన అక్కడి విమానంలో ఎక్కనీయలేదని ఘటన తీవ్ర రచ్చకు దారితీస్తుంది. ఇక దీనిపై అపోసిషన్ నాయకులు సీఎం భగవంత్ మాన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా అమృత్‌సర్‌లోని మక్బూల్‌పురా మరోసారి వివాదానికి దారితీపింది. అక్కడ ఇప్పటికే మత్తుపదార్థాలు, డ్రగ్స్ ల వినియోగం ఎక్కువగా ఉంటుందనే అనేక ఘటనలు వెలుగులోనికి వస్తున్నాయి.

గతంలో ఒక యువతి తప్పతాగి కనీసం నడవలేక ఇబ్బంది పడింది. ఇప్పుడు తాజాగా, యువకుడు డ్రగ్స్ తీసుకున్నాడు. అతను కూడా నడవలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. అయితే.. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే.. దీనిపై ఇప్పటికే అపోసిషన్ నాయకులు తీవ్రంగా స్పందించారు. స్థానిక పోలీసులు కావాలనే డ్రగ్స్ మాఫియాను చూసిచూడనట్లు వదిలేస్తున్నారని, మాముళ్లు తీసుకుని ఇండైరెక్ట్ గా వారికి సపోర్ట్ చేస్తున్నారంటూ కొందరు స్థానిక నాయకులు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం యువకుడు అమృత్‌సర్‌లోని చమ్రాంగ్ రోడ్ లో రోడ్డుపైన తాగి తూలుతు కన్పించాడు. అక్కడ ఓపియాయిడ్ డ్రగ్, బ్లాక్ టార్ హెరాయిన్ లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మరోవైపు పోలీసులు మాత్రం తాము మాదవ ద్రవ్యాల సరఫరాలు నిరోధిస్తున్నామని తేల్చిచెప్పారు.

దీని కోసం తాము ప్రత్యేకంగా డ్రైవ్ లు కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ నెల ప్రారంభంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో కనీసం 350 మంది డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేశారు. రాష్ట్ర పోలీసుల ప్రకారం... వారం రోజుల పాటు జరిపిన దాడుల్లో 6.90 కేజీల హెరాయిన్, 14.41 కేజీల నల్లమందు, 5 కేజీల గంజాయి, 6.44 క్వింటాళ్ల గసగసాలు, 2.10 లక్షల మాత్రలు, క్యాప్సూల్స్, ఇంజక్షన్లు, ఫార్మా ఓపియాయిడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హాని కలిగించే మార్గాలలో యాదృచ్ఛికంగా వాహనాలను శోధించడంతో పాటు డ్రగ్స్ ప్రభావిత ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ల తర్వాత ₹ 4.81 లక్షల మాదక ద్రవ్యం స్వాధీనం చేసుకున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Drinking wine, Punjab, VIRAL NEWS

ఉత్తమ కథలు