హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పోలీసులకే టోకరా.. పరారీలో సిద్ధూ మూసేవాలా హత్య కేసు కీలక నిందితుడు..

పోలీసులకే టోకరా.. పరారీలో సిద్ధూ మూసేవాలా హత్య కేసు కీలక నిందితుడు..

దీపక్ టిను, సిద్ధూ మూసేవాలా (ఫైల్)

దీపక్ టిను, సిద్ధూ మూసేవాలా (ఫైల్)

Punjab: పంజాబ్ ఫెమస్ గాయకుడు సిద్ధూ మూసేవాలను బిష్ణోయ్ తెగకు చెందిన దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ ఘటనకు సంబంధించిన కీలక నిందితుడు ఎస్కేప్ అయ్యాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Punjab, India

పంజాబ్ లోని (Punjab) ఫెమస్ గాయకుడు సిద్ధూ మూసేవాలాను (Sidhu Moose Wala) అతని ఇంటి వద్ద కొంత మంది దుండగులు అతి కిరాతకంగా కాల్పులు జరిపి హత్య చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ హత్యకు సంబంధించిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. తాజాగా, ఈ హత్యలో కీలకంగా వ్యవహరించిన గ్యాంగ్ స్టర్ దీపక్ టిను (Deepak Tinu) పంజాబ్ లోని మన్సాలో పోలీసుల అదుపులో నుంచి తప్పించుకున్నాడు. కాగా, మాన్సా పోలీసులు.. మరో కేసులో గోయింద్వాల్ సాహిబ్ జైలు నుంచి ప్రొటక్షన్ వారెంట్‌పై తీసుకురాగా శనివారం రాత్రి తప్పించుకున్న టినూను పట్టుకునేందుకు మాన్‌హాంట్ ప్రారంభించినట్లు వారు తెలిపారు.

టిను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి సన్నిహితుడు, పంజాబీ గాయకుడి (Punjabi singer) హత్య కేసులో నిందితుడు కూడా. ప్రస్తుతం ఈ ఘటనతో పంజాబ్ పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. ప్రత్యేకంగా పోలీసులను రంగంలోనికి దింపారు. నిందితుడి కోసం అనువణువు జల్లెడ పడుతున్నారు. ఈ సంఘటన గురించి బటిండా రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ముఖ్విందర్ సింగ్ చినా ఫోన్‌లో మాట్లాడుతూ, "నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నామని, దీని కోసం పోలీసు పార్టీలు పనిలో ఉన్నాయని ఆయన అన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసు అధికారి ముఖ్విందర్ సింగ్ చినా తెలిపారు.

మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలాగా ప్రసిద్ధి చెందిన శుభదీప్ సింగ్ సిద్ధూ కాల్చి చంపబడ్డాడు. తన స్నేహితుడు, బంధువుతో కలిసి జీపులో మాన్సాలోని జవహర్ కే గ్రామానికి వెళ్తుండగా హత్యకు గురయ్యాడు. అతని వాహనం మీద ఆరుగురు షూటర్లు బుల్లెట్లతో విరుచుకు పడ్డారు. హత్య తర్వాత, లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు గోల్డీ బ్రార్ హత్యకు బాధ్యత వహించాడు.

ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh) షాకింగ్ ఘటన సంభవించింది.

బస్తీజిల్లాలోనిన ఓక ఆస్పత్రిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కైలీ ఆస్పత్రిలోని పనిచేస్తున్న డాక్టర్ సిద్ధార్థ్ అనే డాక్టర్ కు సోషల్ మీడియాలో ఒక యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ఫోన్ నంబర్ లు మార్చుకుని, తరచుగా వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునే వారు. ఇదిలా ఉండగా.. ఒక రోజు డాక్టర్ యువతిని తన క్లినిక్ కు రమ్మన్నాడు. అతని మాటలు నమ్మి, ఆమె క్లినిక్ కు వచ్చింది.

అప్పుడు ఆమెను గదిలోనికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా యువతి అపస్మారక స్థితిలోనికి వెళ్లిందనుకుని, తన మిత్రులను కూడా ఫోన్ చేసి రప్పించాడు. వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత.. బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన దారుణాన్ని ఇంట్లోని వారికి తెలిపింది. దీంతో స్థానిక పోలీసులు డాక్టర్లపై కేసు నమోదు చేశారు. యువతిని టెస్ట్ ల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Punjab

ఉత్తమ కథలు