Home /News /national /

PUNJAB GOVT GIFT TO WOMEN FREE JOURNEY IN GOVT BUSSES AND MANY MORE CHECK FOR FULL DETAILS BA GH

టికెటమ్మా టికెట్.. అనాల్సిన పనిలేదు.. మహిళలకు ఉచిత ప్రయాణం... రాష్ట్రం మొత్తం

బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలు

బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలు

ఇలాంటి వినూత్న విధానాలు దేశంలో ఇతర ప్రదేశాల్లోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. మైసూరులో ఓపెన్ రూఫ్ డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

బస్సుల్లో టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తే ఏమవుతుంది? ఏముంది భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది.. అని అనుకుంటున్నారా.. మరి, ప్రభుత్వమే ఆ సదుపాయం కల్పిస్తే.. ఇంకేముంది ఉచితంగా హాయిగా తిరిగేయొచ్చు. తాజాగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. రాష్ట్రమంతా ఉచిత ప్రయాణాలకు అనుమతించింది. అయితే ఇది కేవలం మహిళలకు మాత్రమే. మిగిలినవారు యధాతథంగా డబ్బు చెల్లించాల్సిందే. రాష్ట్రంలో ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా మహిళలు బస్సుల్లో ఉచితంగా వెళ్లవచ్చని ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నూతన విధానానికి ముందడుగు వేసింది.

రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణం..
ప్రభుత్వ బస్సుల్లో ఆ రాష్ట్రంలోని ప్రఖ్యాత ప్రదేశాలు, కట్టడాలు, అందమైన పొలాల గుండా ఎక్కడికైనా సులభంగా ప్రయాణించే సౌలభ్యాన్నిచ్చింది. పంజాబ్ అంతటా ఉచితంగా ప్రయాణించవచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బడ్జెట్ సందర్భంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇది పంజాబ్ లోని వేలాది మంది మహిళల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొస్తుందని ఆయన అన్నారు. "అన్ని ప్రభుత్వ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయం మా ప్రభుత్వం తీసుకొన్నందుకు నేను సంతోషంగా ఉంది. ఆడవారిని శక్తిమంతం చేసే ప్రయత్నాల్లో మేము పట్టుదలతో ఉన్నాం. మహిళల సాధికారితే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇకపైనా ఇలాంటి విధానాలే కొనసాగిస్తాం. అందరికి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు " అని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు.

ప్రత్యేక హాస్టళ్లు కూడా..
మహిళలకు ఉచిత ప్రయాణ సౌలభ్యమే కాకుండా మహిళల సాధికారిత సాధించేందుకు పంజాబ్ ప్రభుత్వం 8 కొత్త పథకాలను ప్రవేశపెట్టనుంది. 2047 మంది మహిళా ఉపాధ్యాయులకు నియామక లేఖలను జారీ చేయనుంది. అంతేకాకుండా 181 సాంజ్ శక్తి హెల్ప్ లైన్లు, పోలీస్ హెల్ప్ డెస్కులను ప్రారంభించనుంది. పాటియాలా, జలంధర్, లుథియానా, మొహలీ, బటిండా, మాన్సా లాంటి పట్టణాల్లో పనిచేసే మహిళలకు ఏడు ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేయనుంది. ఎవరైనా పంజాబ్ ను సందర్శించాలని ప్లాన్ చేసుకుంటే వారి పర్యటన కోసం ఇక్కడ వర్చువల్ టూర్ ఆప్షన్ ఉంది.

ఇలాంటి వినూత్న విధానాలు దేశంలో ఇతర ప్రదేశాల్లోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. మైసూరులో ఓపెన్ రూఫ్ డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కశ్మీర్లో భారత సైన్యం పాత బస్టాండును పిల్లలకు కోసం వీధి గ్రంథాలయం(స్ట్రీట్ లైబ్రరీ)గా మార్చింది. ఇప్పుడు పంజాబ్ మహిళల కోసం రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణాలను ప్రారంభించింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Congress, Punjab, Women, Womens day 2021

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు