హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Agricultural laws: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ధర్నాలో పాల్గొని అరెస్టయిన రైతులకు రూ. 2 లక్షలు పరిహారం.. ముఖ్యమంత్రి ప్రకటన

Agricultural laws: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ధర్నాలో పాల్గొని అరెస్టయిన రైతులకు రూ. 2 లక్షలు పరిహారం.. ముఖ్యమంత్రి ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు (Agricultural laws) వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులను ఆకర్షించేందుకు పంజాబ్‌ ప్రభుత్వం (Punjab government) చర్యలు ప్రారంభించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు (Agricultural laws) వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులను ఆకర్షించేందుకు పంజాబ్‌ ప్రభుత్వం (Punjab government) చర్యలు ప్రారంభించింది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ (Tractor Rally)లో పాల్గొని అరెస్టయిన 83 మందికి రూ.2 లక్షల చొప్పున (Rs 2 lakh as compensation for 83 people) పంజాబ్‌ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ మేరకు పంజాబ్​ ముఖ్యమంత్రి చరణ్ జీత్ చన్నీ (Charan jeeth singh channi) ట్వీట్‌ చేశారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం (Delhi Farmers Protest News) చేస్తున్న రైతులకు చరణ్ జీత్ చన్నీ మద్దతు ప్రకటించారు.

“సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్న రైతులకు మా ప్రభుత్వ మద్దతు ఉంటుందని మళ్లీ చెబుతున్నా. జనవరి 26న (రిపబ్లిక్ డే) దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా అరెస్టయిన 83 మందికి రూ.2 లక్షల చొప్పున (Rs 2 lakh as compensation for 83 people) పరిహారం అందించాలని నిర్ణయించాం” అని పంజాబ్ ముఖ్యమంత్రి (Punjab CM) చరణ్ జీత్ చన్నీ అన్నారు.

అయితే.. అసెంబ్లీ ఎన్నికలను (Assemble elections) దృష్టిలో ఉంచుకొనే పంజాబ్‌ ప్రభుత్వం వారికి ఆర్థికసాయం ప్రకటించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిపబ్లిక్ డే (republic day) నాడు రైతు సంఘాల ట్రాక్టర్‌ ర్యాలీకి (Farmers Tractor Rally) పోలీసులు షరతులతో అనుమతించారు. నిర్దేశించిన మార్గాల్లోనే ర్యాలీ (Delhi Farmers Protest News) చేపట్టాలని ఆంక్షలు విధించారు. కానీ ర్యాలీ ప్రారంభమైన కాసేపటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొందరు ఆందోళనకారులు బారికేడ్లను బద్దలుకొట్టి అనుమతిలేని మార్గాల గుండా ఎర్రకోట (red port)కు చేరుకున్నారు. ఆ తర్వాత విధ్వంసకర ఘటనలు (Tractor Rally Violence) చోటుచేసుకున్నాయి. అందుకు బాధ్యులైన వారిని పోలీసులు (police) అరెస్ట్‌ చేశారు.

కాగా, దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది ఎన్నికల స్టంట్​గా పేర్కొంటున్నాయి. హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. ‘‘ ఇది పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న 'సిగ్గుమాలిన' నిర్ణయం. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి పరిహారం ఇవ్వడం దేశ ప్రయోజనాలకు మంచిది కాదు”అని అన్నారు.

First published:

Tags: Agriculture, Farmers Protest, New Agriculture Acts, Punjab

ఉత్తమ కథలు