హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Punjab Farmers: రైతు సంఘాల‌ సంచ‌ల‌న నిర్ణ‌యం.. పంజాబ్‌లో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం!

Punjab Farmers: రైతు సంఘాల‌ సంచ‌ల‌న నిర్ణ‌యం.. పంజాబ్‌లో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం!

ప్ర‌తీకాత్మ‌క చిత్రం (Image: PTI)

ప్ర‌తీకాత్మ‌క చిత్రం (Image: PTI)

Punjab Farmers | ఏడాది పాటు అతిపెద్ద ఉద్య‌మం నిర్వ‌హించిన రైతులు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకొన్నారు. వ‌చ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (Assembly Elections) రాష్ట్రంలోని 117 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 15, 2022 స‌మావేశమై భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తామ‌ని అన్నారు.

ఇంకా చదవండి ...

ఏడాది పాటు అతిపెద్ద ఉద్య‌మం నిర్వ‌హించిన రైతులు(Farmers) మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకొన్నారు. వ‌చ్చే పంజాబ్ (Punjab) అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని 117 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ రైతు ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించిన సంయుక్త కిసాన్ మోర్చా (Samyukta Samaj Morcha) నాయ‌కులు రాజేవాల్, రైతు నాయకులు హర్మీత్ సింగ్ ఖాదియన్, కుల్వంత్ సింగ్ సంధు మీడియాతో మాట్లాడారు.

సంయుక్త సమాజ్ మోర్చా (SSM) పేరుతో బల్బీర్ సింగ్ రాజేవాల్ నాయ‌క‌త్వంలో ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని తెలిపారు. "ఇది రాష్ట్ర ప్రజల డిమాండ్, మేము రైతుల ఆందోళనలో విజయం సాధించాము. ఇప్ప‌డు రాజకీయ రంగంలో కూడా పోరాడాలని చెప్పారు," అని ఖాదియన్ అన్నారు.

పొత్తుపై నిర్ణ‌యం తీసుకోలేదు..

ఈ సంద‌ర్బంగా రైతు సంఘం నాయ‌కులు మాట్లాడారు. ప్ర‌స్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రైతు నాయకులు చెబుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీతో చర్చలు జరుగుతున్నాయని వర్గాలు తెలిపాయి. BKU (దకొండ), BKU (లఖోవాల్), BKU (మేజర్ సింగ్ పూనేవాలా) కూడా తమతో చేరవచ్చని SSM నాయకులు తెలిపారు. రాజకీయాలలోకి దూకేందుకు వారి నియ‌మ నిబంధ‌న‌లు అనుమతించడం లేదని, ముందుగా వారు దానిని సవరించాల్సి ఉంటుందని ఎస్‌ఎస్‌ఎం పేర్కొంది.

BJP: బీజేపీ కొత్త త‌ల‌నొప్పులు.. రాజీనామా చేస్తాన‌ని బెదిరిస్తున్న మంత్రి!


సుముఖంగా లేని 32 సంస్థ‌లు ..

అంతే కాకుండా మోర్చాను పూర్తిగా రైతు వేదిక‌గా ఉంచాల‌ని నిర్ణ‌యం తీసుకొన్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ ఫ్రంట్‌కు SKM పేరు పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఒక ప్రకటనలో, SKM తొమ్మిది మంది సభ్యుల సమన్వయ కమిటీ, ప్రతినిధులు దర్శల్ పాల్ మరియు జగ్జిత్ సింగ్ దల్లేవాల్, మోర్చాలోని 32 సభ్య సంస్థలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుకూలంగా లేవని చెప్పారు.

Corona Cases: ఈ రాష్ట్రాల‌కు కేంద్ర బృందాలు.. టీకాలు, కోవిడ్ ప‌రీక్ష‌ల ప‌రిశీల‌న‌


రాజ‌కీయ‌ ఆలోచనను వ్యతిరేకిస్తున్న సంస్థలలో BKU (దర్శన్ పాల్), BKU (క్రాంతికారి), BKU (సిధుపూర్), ఆజాద్ కిసాన్ కమిటీ (దోబా), జై కిసాన్ ఆందోళన్, దాసుయ గన్న సంఘర్ష్ కమిటీ, కిసాన్ సంఘర్ష్ కమిటీ, లోక్ భలై ఇన్సాఫ్ సంక్షేమ సంఘం, కీర్తి కిసాన్ యూనియన్ ఉన్నాయి.

జ‌న‌వ‌రి 15న స‌మావేశం..

SKM అనేది రైతుల సమస్యలకు రాజకీయేతర వేదిక అని నాయ‌కులు తెలిపారు. దేశవ్యాప్తంగా 400 సంస్థలతో కూడినదని వారు పేర్కొన్నారు. SKM కమిటీ, మోర్చా ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునివ్వదని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత రైతుల ఆందోళన విరమించారు. ఈ నేప‌థ్యంలో SKM తన భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించడానికి జనవరి 15 న సమావేశం కావాలని యోచిస్తోంది.

First published:

Tags: Farm Laws, Farmer, Punjab, Punjab news

ఉత్తమ కథలు